నులి పేద్దాం


Mon,February 18, 2019 11:50 PM

- నేడు జాతీయ నులి పురుగుల దినోత్సవం
-1 నుంచి 19 సంవత్సరాల పిల్లలకు
- అల్బెండజోల్ మాత్రలు తప్పక వేయించాలి
- పాఠశాలలు, కళాశాలల్లో, అంగన్‌వాడీల్లో వేసేలా చర్యలు
- జిల్లా వ్యాప్తంగా 2,72,310 మంది పిల్లలకు వేయనున్న మాత్రలు...
వికారాబాద్, నమస్తే తెలంగాణ : ఆరోగ్యవంతమైన జీవితా న్ని పిల్లలకు అందించడం తల్లిదండ్రుల కర్తవ్యం తప్పని సరిగా పాటించాలి. చిన్నారులకు భవిష్యత్‌లో రోగనిరోధక శక్తిని పెం పొందించేందుకు ప్రభుత్వం రక్తహీనత, పోషకాహార లోపాలు, వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకే మంగళవారం జాతీ య నులిపురుగుల దినోత్సవంలో అల్బెండజోల్ మాత్రలు వే యించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేడు వేయనటువంటి చిన్నారులకు ఈ నెల 23న మరోసారి మాత్రలు వేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా విద్యార్థులకు నులిపురుగుల బారిన పడి అనేక శరీరక సమస్యలు తలెత్తుతుండడంతో వాటి నివారణ కార్యక్రమంలో భాగంగా మాత్రలను ఇవ్వనున్నారు. నులిపురుగుల నివారణ మాత్రలను వేసేందుకు జిల్లా వైద్య, విద్యా శాఖ సంబంధిత అధికారులు కార్యాచరణలో నిమగ్నమయ్యారు.
మంగళవారం జాతీయ నులిపురుగుల దినోత్సవం నిర్వహించనున్నారు. ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు సాగుతూ చిన్నారులందరికీ మాత్రలు వేయించేందు కు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా జిల్లాలో ఈ మా త్రలు వేసుకునేందుకు 2,72,310 మంది పిల్లలు ఉన్నట్లు జిల్లా అధికార యంత్రాంగం తెలియజేశారు. అందు లో 1 నుంచి 5 ఏండ్ల లోపు పిల్లలు 6 4,168 మంది ఉండగా, 6 నుంచి 19 ఏండ్ల పిల్లలు 2,08,142 మంది ఉన్నా రు. అల్బెండజోల్ మా త్రలు వేసే కార్యక్రమంలో 22 పీహెచ్‌సీల పరిధిలో 56 ఎయిడెడ్, ప్రైవేట్ కళాశాలలు ఉన్నా యి. ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు 1,291 ఉన్నాయి. అంగన్‌వాడీ సెంటర్లు 1,107 ఉన్నాయి. అందులో ఆశ వర్కర్లు 743 మంది, అంగన్‌వాడీ, ఆశవర్కర్లు 1,107 మందిని విధుల్లోకి తీసుకున్నారు. ముఖ్యంగా విద్యార్థులకు సరైన విధంగా మాత్రలు అందించేందుకు వైద్య శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులకు మాత్రలను అందించేందుకు విద్య, వైద్య శాఖ అధికారులు సమన్వయంతో ముందుకు సాగి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కసరత్తులు పూర్తి చేసుకున్నారు. ఈ మాత్రలు ఇప్పించేందుకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు వైద్యశాఖ అధికారులు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల చిన్నారుల తల్లిదండ్రులు మాత్రలపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని తెలియపరుస్తున్నారు. ఈ మాత్రలు వేయడం వల్ల చిన్నారులకు భవిష్యత్‌లో అనేక రోగాల బారిన పడే ప్రమాదం ఉండదు.


పిల్లలకు మాత్రలు వేయించాలి
ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా పిల్లలందరికీ తప్పకుండా మాత్రలను వేయించాలి. మాత్రలు పిల్లలకు ఎంతో ఉపయోగకరమైనవి. ఈ మాత్రలు వే సుకోవడం వల్ల ఎలాంటి అనార్థాలు జరుగవు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ అపోహలు వీడి ప్రతి చిన్నారికి ఈ మాత్రలను తప్పనిసరిగా వేయించి వారి భవిష్యత్‌లో చక్కటి ఆరోగ్యవంతమైన జీవితాన్ని సాగించేందుకు సహకరించాలి. నులిపురుగుల నివారణకు ఈ మాత్రలను అందించేందుకు అన్ని చర్య లు తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్క చిన్నారికి తప్పనిసరి గా మాత్రలు వేయించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి. ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా 1 నుంచి 19 ఏండ్ల లోపు పిల్లలందరికీ మాత్రలు తప్పనిసరిగా వేయించాలి. నేడు వేయించనటువంటి పిల్లలకు ఈ నెల 23న మరోసారి మాత్రలు వేసే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.
- ఉపేందర్‌రెడ్డి, జిల్లా వైద్యాధికారి

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...