పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రలు వేయాలి


Mon,February 18, 2019 11:45 PM

మోమిన్‌పేట : పిల్లలందరికీ అల్బెండజోల్ మా త్రలు తప్పనిసరిగా వేయాలని మండల వైద్యాధికారి కృష్ణ అన్నారు. సోమవారం మండలంలోని ప్రధానోపాధ్యాయులందరికీ మండల విద్యాధికా రి కార్యాలయంలో అవగాహన సమావేశం ఏర్పా టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రలు వేయాలని 1, 2 ఏండ్ల పిల్లలకు సగం మాత్రం, 3 నుం చి 19 ఏండ్ల వయస్సు వారికి నిండుమాత్ర వే యాలన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి శంకర్, ఆరోగ్య శాఖ అధికారులు చంద్రశేఖర్, షఖిల్, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
బంట్వారం : ప్రతి పిల్లాడికి అల్బెండజోల్ మా త్రలను తప్పక వేయాలని డాక్టర్ సుధీర్‌కుమార్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని దవాఖానలో వైద్య సిబ్బంది, ఆశవర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భ ంగా ఆయన మాట్లాడుతూ నేటి నుంచి గ్రామాల్లో పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు వేయాలన్నారు. కార్యక్రమంలో సీహెచ్‌వో కిషన్‌నాయక్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
వికారాబాద్ టౌన్ : నూలిపురుగుల నివారణ పై వైద్యాధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఏరియాసుపత్రి అవగాహన ర్యాలీ నిర్వహించి పలువురికి నూలిపురుగుల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు వేయించాలన్నారు. ఈ మాత్రలను పాఠశాలల్లో, అంగన్‌వాడీ సెంటర్లలో, కళాశాలల్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచాలన్నారు. వీటి వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలుగవన్నారు. 19న తప్పిన పిల్లలకు ఫిబ్రవరి 23న మరోసారి మాత్రలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. వీటిపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో నూలిపురుగుల నివారణ అధికారి సుధాకర్‌షిండే, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...