గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి


Fri,February 15, 2019 11:54 PM

మర్పల్లి : గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సేవాలాల్ మహారాజ్ 280 జయంతి సందర్భంగా మండలంలోని పలు తండాల గిరిజన నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్త బస్టాండ్ ఆవరణలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సమావేశానికి వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండల్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు అధికారంలో ఉన్న సమయంలో గిరిజనుల అభివృద్ధి కోసం పట్టించుకోలేదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తండాల్లోని సర్పంచ్‌లుగా కావడం చాలా సంతోషకరం అన్నారు. సేవాలాల్ మహారాజ్‌ను యువకులు ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలన్నారు. మండల కేంద్రంలోని సేవాలాల్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సురేశ్‌కుమార్, నాయకులు అశోక్, రవి, సలీమ్, సర్పంచ్ దరమ్‌సింగ్, సోనిబాయి, తదితరులు పాల్గొన్నారు.
పూడూరు : సేవాలాల్ మహారాజ్ సేవలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు బుక్య సంజీవ్‌నాయక్ అన్నారు. శుక్రవారం పూడూరు మండలం తిర్మళపూర్ గ్రామంలో సేవాలాల్ మహారాజ్ 280వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గిరిజనులు సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా ఆలయంలో యజ్ఞం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవాలాల్ మహారాజ్‌ను ఆదర్శంగా తీసుకొని సంఘ సేవ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కమిళీబాయి. ఉప సర్పంచ్ రాజ్‌కుమార్, నాయకులు కిషన్‌నాయక్, సేవాలాల్ మహారాజ్ కమిటీ నాయకులు బానుప్రకాశ్, సురేశ్, గోపాల్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...