ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతులకు వరం


Fri,February 15, 2019 11:54 PM

వికారాబాద్ రూరల్ : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం రైతులకు వరంలా మారిందని వికారాబాద్ మండల వ్యవసాయాధికారి ప్రసన్నలక్ష్మి అన్నారు. శుక్రవారం వికారాబాద్ మండల పరిధిలోని పీరంపల్లి, ధన్నారం, పెండ్లిమడుగు, పులుసుమామిడి, సిద్దులూర్ గ్రామాలకు చెందిన రైతులతో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారి ప్రసన్నలక్ష్మి మాట్లాడుతూ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా పేద రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఒకరికి మాత్రమే ఈ పథకం వర్థిస్తుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్నా వారు ఈ పథకానికి అనర్హులన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న రైతులకు లబ్ధి చేకూరరాదని, నిజమైన రైతులకు మాత్రమే లబ్ధి చేకూరేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గ్రామ గ్రామానికి తిరిగి చనిపోయిన రైతులు పాసుబుకుల విషయాలు తెలుసుకుంటున్నామన్నారు. 5 ఎకరాలలోపు ఉన్న రైతులు ప్రతి ఒక్కరికి మూడు దఫాలుగా రూ.6వేలు అందిస్తుందన్నారు. ఒక గుంట భూమి ఉన్న కూడా ఈ పథకానికి అర్హులని తెలిపారు. ఈ నెల 20వ తేదీ నుంచి రైతు ఖాతాల్లో జమచేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌లు, ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...