భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలి


Thu,February 14, 2019 11:28 PM

మర్పల్లి/ మోమిన్‌పేట/ బంట్వారం : భూ స మస్యలను వెంటనే పరిష్కరించాలని ఆర్డీవో విశ్వనాథం సూచించారు. గురువారం మండలాల త హసీల్దార్ కార్యాలయాలను ఆకస్మికంగా సందర్శి ంచి పలు రికార్డులను తనిఖీ చేసి పరిశీలించారు. రైతులకు పాస్‌పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని ఆర్డీవో పేర్కొన్నారు. ఎంతో మ ంది రైతులకు పాస్ పుస్తకాలు రా లేవని తహసీల్దార్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం రైతు బ ంధు పథకం కింద రైతులకు ఎకరాకు రూ.8వేల చొప్పున పంపి ణీ చేస్తుందన్నారు. ఎంతో మంది రైతులకు పట్టా పాస్‌పుస్తకాలు రాక రైతు బంధు పథకం అందలేక పోతుందని, దీంతో రైతులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. కల్యాణలక్ష్మి పథకం కింద నిధులు మం జూరు అయ్యాయని, ఈ నెలాఖరులో చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రభు త్వం తెచ్చిన నూతన భూ ప్రక్షాలనను త్వరిత గతిన పరిష్కరించేందుకు అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా పూర్తి చేయాలన్నారు. త్వరలో రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్య ప నుల్లో వేగం పెంచి, ఎలాంటి సమస్యలున్న వెం టనే పరిష్కరించాలన్నారు. రైతులు ఎవ్వరు కూ డా కార్యాలయాల చుట్టూ తిరుగకుండా, అధికారులే సమస్యలను గుర్తించి సరి చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ లలిత, మర్పల్లి డి ప్యూటీ తహసీల్దార్ రవీందర్ దత్తు, రెవెన్యూ సిబ్బ ంది, వీఆర్‌వో రవీందర్ పాల్లొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...