ఉత్తమ వైద్య సేవలకు నజరానా


Wed,February 13, 2019 11:22 PM

-ప్రభుత్వ దవాఖానలోవైద్య సదుపాయాలపై పర్యవేక్షణ
-ఉత్తమ దవాఖానగా ఎన్నికైతే రూ.20 లక్షలు
-వికారాబాద్ ప్రభుత్వ దవాఖానలోవైద్య సేవలు భేష్
-రాష్ట్ర వైద్య విధాన పరిషత్ జాయింట్డైరెక్టర్ రజనీ
-దవాఖానను పరిశీలించిన కాయకల్ప సంస్థ బృందం సభ్యులు

వికారాబాద్, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలోని జిల్లా, మం డల, గ్రామ స్థాయి దవాఖానలో మౌలిక సదుపాయాలను పర్యవేక్షించడానికి కాయకల్ప సంస్థ ఏర్పాటు చేసిన బృందం దవాఖానల్లో వైద్య సేవలను పరిశీలించి అందులో ఉత్తమ సేవలందించిన దవాఖానలను గుర్తించి నజరానాలను అంది ంచడం జరుగుతుందని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ జాయిం ట్ డైరెక్టర్ రజనీ అన్నారు. బుధవారం వికారాబాద్ ప్రభుత్వ దవాఖానలో వైద్య సేవలను పరిశీలించేందుకు బృందంతో వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 121 ప్రభుత్వ దవాఖానలను పర్యవేక్షించి మొదటి, ద్వితీయ తనిఖీల సందర్భంగా మార్పులు వేయడంతో 7 బెస్టు దవాఖానలు ఎంపికయ్యాయని తెలిపారు. అందులో వికారాబాద్ జిల్లా ఏరియాసుపత్రి కూడా ఉందని తెలిపారు. ఈ నెల 7న దవాఖానల్లో మొదటి బెస్టు దవాఖానగా ఎంపిక చేయడానికి ఫైనల్‌గా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ 7 దవాఖానల్లో మొదటి దవాఖానగా ఎంపిక చేసేందుకు అందులో భాగంగానే వికారాబాద్ ఏరియాసుపత్రిలో మౌలిక సదుపాయాల విషయమై వైద్య సేవలు అందించడంపై బెస్టు దవాఖానగా గుర్తించడానికి పర్యవేక్షణ చేసినట్లు తెలిపారు. వికారాబాద్ బెస్టు దవాఖానగా ఎంపికైతే రూ.20లక్షల నగదు అందజేస్తామని తెలియజేశారు.

రెండో స్థానం వస్తే రూ.15లక్షల నజరానా ఉంటుందన్నారు. 70 శాతం మార్పులు సాధించిన 7 దవాఖానలకు రూ.1లక్ష చొప్పున నిధులు కేటాయిస్తామని తెలియజేశారు. బెస్టు దవాఖానగా ఎంపికైన వారు రూ.20లక్షలతో దవాఖానని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలన్నారు. 25 శాతం నిధులు సిబ్బంది అవసరాలకు, 75 శాతం నిధులు దవాఖాన అభివృద్ధి కోసం ఖర్చు చేసుకుంటూ రోగులకు వసతులు కల్పించాలన్నారు. బెస్టు అవార్డుల ఎంపిక కోసం కాయకల్ప సంస్థ ఏర్పాటైందని మూడు బృందాలుగా విడిపోయి రాష్ట్రంలో ఉన్న అన్ని దవాఖానల్లో అమలవుతున వైద్య సదుపాయాలను పర్యవేక్షిస్తున్నట్లు ఆమె తెలిపారు. వికారాబాద్ దవాఖానలో మౌలిక సదుపాయాలు సక్రమంగా ఉన్నాయని, రోజు వారి రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతుందన్నారు. దాదాపు ప్రతి రోజు 200 నుంచి 400 మంది వరకు దవాఖానలో ఔట్ పేషెంట్లుగా చికిత్సలు పొందుతున్నారని ఆమె తెలిపారు. ప్రస్తుతం నెలకు 50 ప్రసవాలు చేయాల్సి ఉండగా, 150 వరకు అవుతున్నాయన్నారు. 150 వరకు ప్రసవాలు చేసి వికారాబాద్ దవాఖానలో వైద్యులు రికార్డు సృష్టించారని ఆమె తెలిపారు. కార్యక్రమంలో కాయకల్ప సంస్థ డాక్టర్లు అర్జున్, భద్రీనాథ్, ఏడుకొండలతో పాటు వికారాబాద్ దవాఖాన సూపరింటెండెంట్ యాదయ్య, ఇతర డాక్టర్లు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...