నర్సరీల పనులు త్వరిత గతిన పూర్తి చేయాలి : ఎంపీడీవో సుభాషిణి


Wed,February 13, 2019 11:21 PM

వికారాబాద్ రూరల్ : గ్రామ పంచాయతీ కింద ఉన్న నర్సరీల ప నులను త్వరగా పూర్తి చేయాలని ఎంపీడీవో సుభాషిణి ఉపాధి హామీ సిబ్బందికి సూచించారు. బుధవారం పట్టణంలోని స్త్రీ శక్తి భవనంలోని ఉపాధి హామీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ స మావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే మండలంలోని బురాన్‌పల్లి, కామాడ్డిగూడ నర్సరీ పనులను పరిశీలించారు. ఈ స ందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్స రీ పనులను త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ప్రతి గ్రామానికి 60 వేల మొక్కలను నర్సరీలో ఏర్పాటు చేయాలన్నారు. మొక్కలకు అవసరమైన నీటిని ఎల్లప్పుడు ఉండేలా ఫీల్డ్ అసిస్టెంట్లు చూసుకోవాలన్నారు. ప్రతి ఇంటికి 6 మొక్కలు అందించి బాధ్యతలు ఇంటి యజమానికి అప్పగించాలన్నారు.
ప్రతి గ్రామానికి మంజూరైన మరుగుదొడ్లను వెంటనే నిర్మింపజేసి గ్రామాన్ని ఓడీఎఫ్ గ్రామంగా మార్చాలన్నారు. సమయానుకూలంగా నీరు పెట్టాలని, పిచ్చిమొక్కలు మొలవకుండా ప్రతి రోజు చూసుకోవాలని కూలీలకు సూచిస్తు మొక్కలు ఏపుగా పెరిగేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చూస్తున్నామన్నారు. ఉపాధి హామీ కూలీలతో ముచ్చటిస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్షికమంలో ఏపీవోలు శ్రీనివాస్, నవీన్, టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...