పశువుల దాహార్తి తీరుస్తున్న నీటి తొట్లు


Wed,February 13, 2019 11:20 PM

-మండలంలో ఉపాధి హామీ ద్వారా 19 తొట్టీల నిర్మాణం
-నిర్మాణానికి రూ.4,50,680 లక్షలు కేటాయింపు
-నిర్వహణ బాధ్యతగ్రామ పంచాయతీలకు అప్పగింత
-చెరువులు, కుంటల్లో నీరు లేకపోయినానీటి తొట్టీల్లో పుష్కలం
-హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామాల రైతులు

మోమిన్‌పేట : వానకాలంలో వరుణుడు ముఖం చాటేయడంతో మండలంలో అతితక్కువ వర్షపాతం నమోదు కావడంతో కుంటల్లో, చెరువుల్లో నీరు పూర్తిగా అడుగంటిపోయింది. బోరుబావుల్లో నీరు రావడం లేదు. ప్రభుత్వం ఎన్ని బోర్లు.. ఎంత లోతులో వేసినా చుక్కనీరు రాలేదు.. దాహం తీరలేదు. తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడింది. బిం దెడు నీటి కోసం ప్రజలు వ్యవసాయ బోరు బావుల వద్దకు పరుగులు తీసేవారు. గ్రామాల్లోని ప్రజలతో పాటు పశువులకు కూడా నీటి సమస్య ఏర్పడింది. ఉన్నా కొద్ది నీటితో ప్రజలకు, పశువులకు నీటి ట్యాంకులను ఏర్పాటు చేసింది. అయితే పశువుల కోసం 2015-16లో ఉపాధి హామీ పథ కం కింద నిర్మించిన నీటి తొట్టీల్లో నీరు నింపుతుండడంతో గ్రామాల్లో గొర్రె లు, మేకలు, ఎద్దులు, బర్రెలు దాహార్తి తీర్చుకుంటున్నాయి. ఉపాధి హామీ పథకం ద్వారా మండల పరిధిలోని 19 తొట్టీలను నిర్మించారు. గ్రామాల వారీగా చక్రంపల్లిలో 3, మొరంగపల్లి లో 2, వెల్చాల్‌లో 1, టేకులపల్లిలో 3, ఎన్కెపల్లిలో 3, కేసారంలో 5, దుర్గం చెరువులో 2 నీటి తొట్టీలు నిర్మించారు. ఈ ఏడాది వర్షాలు సక్రమంగా కురువకపోవడంతో గ్రామంలోని నీటి ట్యా ంకు నుంచి నేరుగా తొట్టీలకు నల్లాలు బిగించడంతో నల్లాలు విడిచిన సమయంలో నీరు నింపుతుండడంతో ఉదయం, సాయం త్రం పశువులు దాహార్తి తీర్చుకుంటున్నాయి. పశువులకు నీరు తాపించేందుకు రైతులు ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. గ్రామాల్లోని నీటి తొట్టీలను నింపుతుండడంతో పశువులకు నీరు తాపడం సులువగా మారిందని రైతులు అంటున్నారు. రెండేండ్ల నుంచి ప్రతి రోజు నీటి తొట్లు దగ్గరే పశువులకు నీరు తాగిస్తున్నామని పలు గ్రామాల రైతులు తెలుపుతున్నారు.

ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మాణం..
ఉపాధి హామీ పథకం ద్వారా 2015-16లో మండల ంలో 19 నీటితొట్టీల నిర్మాణానికి మొత్తం రూ.4,50,680 లక్షలు ఖర్చు చేశారు.
ఒక్కొక్క తొట్టీకి రూ.23,720లు వెచ్చించడం జరిగిందన్నారు. అయితే నీటితొట్టీల నిర్వహ ణ మొత్తం గ్రామ పంచాయతీకి కేటాయించడం జరిగింది. గ్రామ పంచాయతీ సిబ్బంది వీటి నిర్వహణాన్ని చూసుకోవాల్సి ఉంటు ంది. గ్రామానికి నీటిని సరఫరా చేసే వాటర్‌మ్యాన్ నీటి తొట్టీల్లో ప్రతి రోజును నీరు నింప్పాల్సి ఉం టుంది. నీటితొట్టీల్లో మట్టి, చెత్తచెదారం పడకుండా చూసుకోవడం, ప్రతి 15 రోజుల కోసారి నీటితొట్టీని శుభ్రం చేసే బాధ్యత వాటర్‌మ్యాన్ చూసుకోవాల్సి ఉంటుంది. నీటితొట్టీలకు ఏమి జరిగిన, మరమ్మతులు కూడా వాటర్ మ్యాన్ చూసు కోవాల్సి వస్తున్నది.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...