దేవాలయాల్లో వార్షికోత్సవాలకు ఏర్పాట్లు


Wed,February 13, 2019 11:17 PM

తాండూరు, నమస్తే తెలంగాణ: చారివూత్మక ప్రాధాన్యతను సంతరించుకున్న తాండూరు మండలం దస్తగిరిపేట్ గ్రామంలో ఉన్న శ్రీదేవి, భూదేవి శ్రీ వేంక స్వామి దేవాలయంలో వార్షికోత్సవాలకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్త్తున్నారు. అత్యంత వైభవంగా వార్షికోత్సవ ఉత్సవాలు నిర్వహించేందుకు ఇప్పటికే ఆలయ ధర్మకర్తల మండలి నిర్వాహక కమిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. తాండూరు ప్రాంతంలో ప్రజలకు ఏకైక వేంక ఇదే కావడంతో నియోకవర్గంలోని తాండూరుతో పాటు తాండూరు, యాలాల, పెద్దేముల్, బషీరాబాద్ మండలాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో వార్షికోత్సవ ఉత్సవాల్లో పాల్గొంటారు. స్వామి వారి ఆలయం గ్రామంలో ఉండడంతో దస్తగిరిపేట్‌ను చంద్రగిరి అని కూడా పిలుస్తారు. ఆలయం అతి పురాతనమైనది కావడం విశేషం. ఆలయంలో కొలువైన స్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా దర్శనమిస్తారు. వజ్రవైడుర్యాలతో చేసిన అభరణాలను ఆరేళ్ల క్రితం తాండూరు పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి బాలాజీ శ్రీనివాస్ ప్రత్యేకంగా చేయించి ఆలయం నిర్వహణను పర్యవేక్షించారు. ఆయన కుంటుంబమే ప్రస్తుతం ఆలయంలో ఉత్సవాల నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తోంది.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...