ట్రాక్టర్ లోడర్ ఢీ కొని మహిళ కూలీ మృతి


Wed,February 13, 2019 11:17 PM

మధ్యవూపదేశ్ మాల్‌వావ్ గ్రామానికి చెందిన కారుబాయి(45) మృతి
పెద్దేముల్ : మండల పరిధిలోని మారేపల్లి గ్రామ శివారులో ఉన్న సుమిత్ర పత్తి మిల్లులో ట్రాక్టర్ లోడర్ ఢీకొని మహిళ కూలీ మృతి చెందిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పెద్దేముల్ మండల పరిధిలోని మారేపల్లి గ్రామ శివారులో ఆరమైసమ్మ గుడికి వెనుక భాగంలో ఉన్న సుమిత్ర పత్తి మిల్లులో కూలీగా పనిచేస్తున్న కారుబాయి(45) మంగళవారం అర్థరాత్రి నిద్రిస్తుండగా అక్కడే మిల్లులో పత్తి తీయడానికి ఉపయోగించే ట్రాక్టర్ లోడర్ రివర్స్ తీసుకుంటుఉండగా ప్రమాదవశాత్తు అక్కడే ప్రక్కనే నిద్రిస్తున్న కారుబాయి ముఖంపైకి ట్రాక్టర్ లోడర్ ట్రైరు ఎక్కింది. అది గమనించిన అక్కడే పనిచేస్తున్న కూలీలు సుమారు 10.30 గంటల ప్రాంతంలో తాండూర్‌లోని ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లగా వైద్యులు పరీక్షలు చేసి కారుబాయి చనిపోయినట్లు నిర్థారించారు. కాగా కారుబాయి భర్త అయిన తుకారియా పెద్దేముల్ పోలీసులకు కంప్లేట్ ఇవ్వగా.. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోని జరిగిన విషయంపై ఆరా తీసి, ఆమె చావుకి కారణం అయిన ట్రాక్టర్ లోడర్‌ని అదుపులోకి తీసుకోని, దాని డ్రైవర్, సుమిత్ర పత్తి మిల్లు యాజమాన్యం పైన కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...