కంటి వెలుగుకు అపూర్వ స్పందన


Wed,February 13, 2019 11:12 PM

కొడంగల్, నమస్తే తెలంగాణ : మండలంలోని గ్రామంలో బుధవారం ర్వ కంటి వెలుగు కార్యక్షికమానికి అపూర్వ స్పందన ఏర్పడుతుందని ఆప్తాల్మిక్ వైద్యులు హరినాథ్‌నెహ్రూ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్షికమంలో ప్రజలు ఉత్సహంగా పాల్గొంటూ కంటి పరీక్షలను నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలు కంటి సమస్యలు తలెత్తితే అంతగా పట్టించుకునే అవకాశం ఉండేది కాదని, కానీ ప్రభుత్వం నేరుగా గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్షికమంతో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తుండటంతో ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని, సౌకర్యాలు లేక కంటి సమస్యలను పట్టించునే ఆస్కారం ఉండేది కాదని ప్రజలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. కంటి సమస్యలపై చిన్నపాటి అశ్రద్ధ కూడా వహించరాదని, కంటి వెలుగు కార్యక్షికమాన్ని సద్వినియోగం చేసుకొని కంటి చూపును కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్షికమంలో ఆశ,అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

పేదలకు వరం కంటి వెలుగు
బొంరాస్‌పేట : కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కంటిచూపు కల్పించేందుకు ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్షికమం పేదలకు వరం లాంటిదని మండల వైద్యాధికారి రవీంద్ర యాదవ్ అన్నారు. బుధవారం మండలంలోని లింగన్‌పల్లి గ్రామంలో కంటి వెలుగు వైద్య శిబిరాన్ని సర్పంచ్ కాశప్ప ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ట్లా కంటిచూపు సమస్యలతో బాధపడే వారు కార్పొరేట్ దవాఖానాలలో వేల రూపాయలు ఖర్చు చేసేవారని, అలాంటి వారికి మేలు కలిగించేందుకు ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్షికమాన్ని ప్రారంభించిందన్నారు. సర్పంచ్ కాశప్ప మాట్లాడుతూ గ్రామాలలో కంటి వెలుగు వైద్య శిబిరం ఏర్పాటు చేసినప్పుడు ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అనంతరం వైద్యుడు గోపాల్ ప్రజలకు కంటి పరీక్షలు చేసి కండ్లద్దాలు పంపిణీ చేశారు. కార్యక్షికమంలో సిబ్బంది సుదర్శన్, ఏఎన్‌ఎంలు,తదితరులు

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...