ఆశీర్వదించండి.. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా


Sun,January 20, 2019 11:23 PM

నవాబుపేట: ఇన్నేండ్లు సరైన నాయకుడు లేక గ్రామం అన్ని రంగాల్లో వెనబడిందని ఈనెల 25న జరగనున్న సర్పంచ్ ఎన్ని కల్లో ఓటు వేసి ఘన విజయాన్ని అందిస్తే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని మాదారం గ్రామ పంచాయతీకి టీఆర్‌ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి విద్యావంతుడు పట్లోళ్ల విద్యాసాగర్ అన్నారు. వ్యవసాయమే ప్రధాన ఆధారంగా జీవి స్తున్న గ్రామస్తులకు ఊట చెరువుల నిర్మాణం,విరివిగా చెక్‌డ్యాంల నిర్మాణాలతో వ్యవసాయ రంగం అభివృద్ధ్ధికి కృషి చేస్తానన్నారు. అదే విధంగా గ్రామంలో ప్రతి వీధికి సీసీ రోడ్ల నిర్మా ణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేయించడమే కాకుండా ప్రతి ఇంటికి మరుగు దొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఉన్నత విద్య నభ్యసించిన నేపథ్యంలో స్వార్థ కోసం ఉద్యోగం చేయడం ఇష్టం లేదని అన్ని విధాలుగా వెనకబడిన గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలిచానని గ్రామస్తులు ఆశీర్వదిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి తీరుతానని అన్నారు. టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థిని కావడంతో ప్రభుత్వం నుంచి విరివిగా నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానన్నారు. సంక్షేమ పథకాలను సైతం అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడానికి కృషి చేస్తానని అన్నారు.

అధికార పార్టీ బలపరిచిన సర్పంచ్ గెలుపుతోనే గ్రామం ప్రగతి పథంలో నడుస్తుందని అన్నారు. అదే విధంగా గ్రామంలో ప్రయాణికులు సౌకర్యార్థం బస్‌షెల్టర్, ఆయా కార్యక్రమాలు నిర్వహించడానికి కమ్యూనిటీహాలు, మాదారం కడ్చర్ల, మాదారం కుమ్మరిగూడ గ్రామాలకు రోడ్ల నిర్మాణం చేయించి గ్రామ ప్రజలకు సంపూర్ణ రవాణా సౌకర్యం కల్పిస్తానని అన్నారు. ఈ పనులన్నీ ప్రభుత్వం అండతోనే సాధ్యమని ఈ నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్‌ఎస్ బలపరిచిన తనను గ్రామస్తులు సర్పంచ్‌గా గెలిపించాలని కోరారు. అంతే కాకుండా గ్రామం మీదుగా గేటువనంపల్లి గ్రామానికి నిర్మించిన బీటీ రోడ్డుకు గ్రామ సమీపాన వాగుపై బ్రిడ్జి నిర్నాణం చేయలేదని దీంతో ఎందరో ఇక్కడ పడిపోయి గాయాల పాలైయ్యారని స్థానిక ఎమ్మెల్యే యాదయ్య చొరవతో బ్రిడ్జి నిర్మాణం చేయిస్తానని ఆయన చెప్పారు. గత కొన్నేండ్లుగా తల్లి శమంతమ్మ సైతం డ్వాక్రా సంఘాల అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నదని మహిళా సాధికారతకు పాటుతున్న తరుణంలో గ్రామంలో డ్వాక్రా సంఘాల అభ్యున్నతి కోసం డ్వాక్రా భవనాన్ని కూడా నిర్మాణం చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈనెల 25న జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో కత్తెర గుర్తుకు అధిక ఓట్లు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...