ఓటర్ నమోదును పకడ్బందీగా నిర్వహించాలి


Sun,January 20, 2019 11:23 PM

వికారాబాద్, నమస్తే తెలంగాణ : స్పెషల్ క్యాంపెనింగ్‌లో భాగంగా కొత్త ఓటర్ కార్యక్రమాన్ని సరైన విధంగా నిర్వహించాలని కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ అన్నారు. ఆదివారం ఓటర్ల నమోదు స్పెషల్ మెగా క్యాంపెనింగ్‌లో భాగంగా జిల్లాలోని ఓటర్ నమోదు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల ప్రత్యేక నమోదు సవరణ క్యాంపెనింగ్‌ను బీఎల్‌వోలు సరైన విధంగా చేపట్టాలని సూచించారు. ఫారమ్ 6,7,8లను సిద్ధంగా ఉంచుకొని తప్పులను సరిదిద్ధంతో పాటు కొత్త ఓటర్ నమోదు కూడా సరైన విధంగా నిర్వహించాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉద నుంచి సాయంత్రం 5 గంటల వరకు బూత్ లెవల్ అధికారులు అందుబాటులో ఉండి సరైన విధంగా ఓటర్ చేపట్టాలని సూచించారు. స్పెషల్ క్యాంపెనింగ్ సందర్భంగా వికారాబాద్ సంఘం లక్ష్మీబాయి పాఠశాల, బాల్‌భవన్, బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం పక్కన బాలికల పాఠశాల, మోమిన్‌పేట వెల్‌చాల్, దుర్గంచెరువు పోలింగ్ కేంద్రాలను తనిఖీలు చేసినట్లు తెలిపారు. ఓటు హక్కు కలిగి ఉన్నప్పుడే మనకు చక్కటి పరిపాలన అందించే నాయకులను ఎన్నుకునేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...