ఆదరించండి.... గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తా


Sun,January 20, 2019 11:23 PM

- టీఆర్‌ఎస్ బలపరిచిన తిమ్మారెడ్డిపల్లి సర్పంచ్ అభ్యర్థి కందాడ పద్మ
నవాబుపేట: అధికార పార్టీ అండదండలతో తిమ్మారెడ్డిపల్లి గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని టీఆర్‌ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కందాడ పద్మ అన్నారు. ఇదివరకే ఎమ్మెల్యే యాదయ్య చొరవతో తన భర్త టీఆర్‌ఎస్ మండ ల అధ్యక్షుడు కందాడ నాగిరెడ్డి గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి గ్రామాభివృద్ధికి పదవులు లేకుండానే స్వచ్ఛందంగా కృషి చేశారని అన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 25న జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్‌గా భారీ మెజారితో విజయాన్ని అందిస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఆమె తెలిపారు. గ్రామానికి కాలి నడకకు కూడా దారి లేదని గ్రామం నుంచి బయటకు వెళ్లాలంటే ఎంతో ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే యా దయ్య చొరవతో గ్రామానికి రూ.1.42 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణం చేయించారన్నారు. అంతే కాకుండా తిమమరెడ్డిపల్లి నుంచి కుమ్మరిగూడ రోడ్డు ఫార్మేషన్‌పనులను రూ.10 లక్షలతో చేపట్టి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. అదే విధంగా గ్రామ సమీపాన వెలసిన నంభిగురు మఠానికి కూడా గ్రామం నుంచి రోడ్డు నిర్మాణాన్ని రూ. 4లక్షలతో చేపట్టి దారి కల్పించినట్లు చెప్పారు.

ఉపాధి హామీ నిధులు రూ.24లక్షలతో గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం చేయించినట్లు తెలిపారు.అంతే కాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు, సంక్షేమ కార్యక్రమాలను అందించామన్నారు. ఈనెల 25 జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో భారీ మెజారిటీ అందించి సర్పంచ్‌గా ఘన విజయాన్ని అందిస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. మండలానికి సీఎం పది కోట్ల రూపాయలను అందించిన నేపథ్యంలో ఎమ్మెల్యే చొరవతో గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కమ్యూనిటీ హాలు, రైతు రోడ్ల నిర్మాణం చేయిస్తానని చెప్పారు. అధికార పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్న ఆమెను సర్పంచ్‌గా ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. గ్రామ ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆమె పదే పదే ఓటర్లను కోరారు. ప్రభుత్వం అండతోనే అభివృద్ధి సాధ్యమని తప్పకుండా సర్పంచ్‌గా ఆశీర్వదించి గ్రామాభివృద్ధికి దోహదం చేయాలని ఆమె కోరారు.

ఇతర పార్టీలు బలపరిచిన వ్యక్తులకు మద్దతు ఇస్తే గ్రామాభివృద్ధిని నిర్లక్ష్యం చేసినవారవుతారని ఆమె అన్నారు. అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధుల ద్వారానే అనుకున్న అభివృద్ధి సాధ్యమని ఆమె చెప్పారు. ఎమ్మెల్యే యాదయ్య అండదండలతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే కాకుండా, సంక్షేమ పథకాలను అందించడానికి అరుదైన అవకాశం ఉన్నదని ఈ సదావకాశాన్ని జారవిడవకూడదని ఆమె కోరారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థిగా సర్పంచ్ పదవి పోటీలో ఉన్న ఆమెకు ఉంగరం గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని పదే పదే కోరారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...