ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి


Sat,January 19, 2019 11:52 PM

- ఫిబ్రవరి 1 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ ప్రారంభం
- విద్యార్థులకు స్కిల్ డెవలప్ చేయాలి
- ఆయా కళాశాలల ప్రధానోపాధ్యాయులకు
జిల్లా ఇంటర్ బోర్డు అధికారి శంకర్ సూచన
వికారాబాద్ టౌన్ : త్వరలో జరుగనున్న ఇంటర్మీడియట్ ప్రాక్టీకల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ జిల్లా ఇంటర్ అధికారి శంకర్ సూచించారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లాలోని అన్ని గురుకుల, ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రాక్టీకల్స్ పరీక్షలకు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ అధికారి శంకర్ మాట్లాడుతూ పర్యావరణ, మానవన నైతిక విలువలపై జరుగబోయే పరీక్షలకు విద్యార్థులందరూ హాజరు అయ్యేలా చూడాలని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ సూచించారు. ఈ నెల 28న మానవ నైతిక విలువలపై మొదటి పరీక్ష, అదే విధంగా ఈ నెల 31న పర్యావరణంపై రెండో పరీక్షలు నిర్వహించాలని ఆయా కళాశాలల ప్రిన్సిపాల్ సూచించారు. ఈ పరీక్షలకు సంబంధించిన సామగ్రి అందుబాటులో ఉందన్నారు. ఇంటర్ ప్రాక్టీకల్స్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం అవుతాయన్నారు. విద్యార్థులు మాస్ కాపీలకు అవకాశం ఇవ్వకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో గురుకుల, ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...