నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ


Sat,January 19, 2019 11:49 PM

- ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబుమోజస్
వికారాబాద్, నమస్తే తెలంగాణ : జిల్లా పరిధిలోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు వివిధ కోర్సులలో నాలుగు నెలలు పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబుమోజస్ తెలిపారు. నిరుద్యోగ యువతకు శిక్షణ, భోజన వసతి సదుపాయాలు కల్పించనున్నట్లు శనివారం వెల్లడించారు. శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. వివిధ కోర్సులలో శిక్షణ అనంతరం సర్టిఫికేట్లు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. హైదరాబాద్ బాలానగర్ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని సెంట్రల్ ఇన్ ఆఫ్ టూల్ డిజైనింగ్ సంస్థలో ట్యాబ్లెడ్స్, మొబైల్ ఎల్ ఎల్ ప్లాస్మా టీవీ, హోం థియేటర్, ఆడియో, వీడియో, రూమ్ హెర్ హోం అప్లియన్సెస్ సంబంధి అంశాలలో శిక్షణ ఉంటుందని తెలిపారు. ఇందుకు గాను ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లామా, బీఎస్సీ ఫిజిక్స్, కెమెస్ట్రీ, మ్యాథమెటిక్స్, బీఈ, బీటెక్ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. టూల్ ఇంజనీరింగ్, మాస్టర్ సర్టిఫికేట్ కోర్సు కోసం డిప్లమా, డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలన్నారు. అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయస్సు గల వారు అర్హులని పేర్కొన్నారు. పట్టణ ప్రాంత వాసుల వార్షికాదాయం రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంత వాసుల వార్షికాదాయం రూ.1.50 లక్షలు మించని వారు ఈ శిక్షణకు అర్హులన్నారు. యువతీ, యువకులకు ప్రత్యేక వేర్వురుగా వసతి సదుపాయం కల్పించబడునని తెలిపారు. ఆసక్తి గల ఎస్సీ అభ్యర్థులు ఆధార్ కార్డు, రేషన్ పాస్ సైజ్ ఫోటోలు, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు విద్యార్హత పత్రాల జిరాక్స్ జత పర్చి దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను వికారాబాద్ కలెక్టరేట్ ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో దరకాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...