రవీంద్రభారతిలో కళాకారిణి డక్కలి బాలమ్మ సంస్మరణ సభ


Sat,January 19, 2019 11:49 PM

పెద్దేముల్: ఇటీవల మండల పరిధిలోని మంబాపూర్ గ్రామంలో మరణించిన 12 మెట్ల కిన్నెర తెలంగాణ కళాకారిణి డక్కలి బాలమ్మ సంస్మరణ సభను శనివారం హైదరాబాద్ రవీంద్రభారతీలోని సమావేశ పుగదిలో రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో తెలంగాణ ఆల్ ఆర్ట్ రీసెర్చ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ డక్కలి బాలమ్మ గారు తెలంగాణలో మొదటి 12 మెట్ల కిన్నెర కళాకారిణి, ఆమె చనిపోడం చాలా బాధకరం రాష్ట్రం ఓ కళామ తల్లిని కోల్పోయిందని అన్నారు. “ భారత సంస్కృతి పునాదివేర్లు-తెలంగాణ తల్లి వెర్లు అని అన్నారు. ఇటువంటి కళాకారులకు సహకారం అందిస్తామని అన్నారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్ మాట్లాడుతూ కళ అనేది కళ కోసం కాదు- ప్రజల కోసం అని నేడు ఆ కళ కడుపు కోసం నేడు రాష్ట్రంలో కిన్నెర వాయిద్యాలు కనుమరుగు అవుతున్నాయని అన్నారు.అందుకు ప్రాచీన కళాకారులను సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారు కావున “ రంగస్థల దినోత్సవం రోజున మరోసారి ప్రదర్శనకు అందరికి అవకాశం ఇస్తామని అన్నారు.వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల మంబాపూర్ గ్రామానికి చెందిన కిన్నెర కళాకారిణి డక్కలి బాలమ్మ గత సంవత్సరం డిసెంబర్ 8న చనిపోయారు ఆమె కళను గుర్తించి సంస్మరణ సభ నిర్వహించడం విశేషం. కార్యక్రమంలో ప్రొ.తంగెడకిషన్ రావు, జితేంద్రబాబు,సూర్య ధనుంజయ్, పాశం యాదగిరి,కృష్ణ, దాసరి రంగా, కే.వెంకటయ్య, కిన్నెర కళాకారులు పాల్గొన్నారు.

174
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...