కొడంగల్ నియోజకవర్గానికి సాగు అందిస్తాం


Sat,January 19, 2019 11:49 PM

-పాలమూరు ఎత్తిపోతల ద్వారా 1.10 లక్షల ఎకరాలకు నీరు
-గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తాం
-టీఆర్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాల్లో అభివృద్ధి
-ఎమ్మెల్యే పట్నం నరేందర్
కొడంగల్, నమస్తే తెలంగాణ/బొంరాస్ : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కొడంగల్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని, చెరువులను నింపి రైతులకు సాగునీటి కొరత తీరుస్తామని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల చివరి రోజు శనివారం ఆయన బొంరాస్ మండలంలోని లగచెర్ల, దుద్యాల, చిల్ కొడంగల్ మండలం పర్సాపూర్ గ్రామాల్లో టీఆర్ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన సభల్లో నరేందర్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన మేరకు రైతులకు సాగునీరు అందిస్తామని చెప్పారు. కొడంగల్ నియోజకవర్గంలో కొత్తగా బొంరాస్ మండలంలో దుద్యాల, కోస్గి మండలంలో గుండుమాల్, మద్దూరు మండలంలో కొత్తపల్లి గ్రామాలను మండల కేంద్రాలుగా ఏర్పాటు చేస్తున్నామని కొంత సమయం తర్వాత వీటిపై ఉత్తరువులు వస్తాయని ఎమ్మెల్యే చెప్పారు. మార్చిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తామని, సంక్షేమ పథకాల ఫలాలను కూడా ఏప్రిల్ నుంచి అందిస్తామని ఆయన చెప్పారు.

సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథాకాల వల్లనే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ పార్టీ ఘన విజయం సాధించి రెండో సారి అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్రంలో టీఆర్ ప్రభుత్వం, కొడంగల్ అదే పార్టీ ఎమ్మెల్యే ఉన్నందున గ్రామాల్లో కూడా టీఆర్ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్ ఎన్నుకుంటే గ్రామాలు సమగ్రంగా అభివృద్ధి చెందుతాయన్నారు. ప్రభుత్వం నుంచి గ్రామాలకు పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయించి మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మిషన్ భగీరథ పథకం ద్వారా నెల రోజుల్లో ఇంటింటికీ తాగునీరు అందిస్తామని చెప్పారు. దుద్యాల గ్రామానికి లైబ్రరీ మంజూరు చేయించి స్వంత భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కొడంగల్ ఎంపీపీ ముద్దప్ప దేశ్ జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు కృష్ణ, మండల టీఆర్ పార్టీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ పార్టీ నాయకులు గోపీనాయక్, మధుయాదవ్, మహేందర్ కోట్ల యాదగిరి, ఎల్లప్ప, శ్యాసం రామక్రిష్ణ, నారాయణరెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

టీఆర్ చేరిక
మండలంలోని లగచెర్ల గ్రామంలో కాంగ్రెస్ రోటిబండతండా ఉప సర్పంచ్ సేవ్యానాయక్, లగచెర్ల కాంగ్రెస్ కార్యకర్తలు మొగులయ్య, చెన్నయ్య, వెంకటయ్య పట్నం నరేందర్ సమక్షంలో టీఆర్ చేరారు. వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన రోటిబండతండా సర్పంచ్ పెంటీబాయిని ఎమ్మెల్యే సన్మానించారు.

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...