తండాలను జీపీలు చేసిన ఘనత టీఆర్ పార్టీదే..


Sat,January 19, 2019 11:49 PM

-నియోజకవర్గంలో 19 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం
-ప్రతి కులాన్ని ఆదుకుంటున్న తెలంగాణ సర్కార్
-త్వరలో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు
-టీఆర్ హయాంలేనే గ్రామాల అభివృద్ధి
-అన్ని చోట్ల సర్పంచ్, వార్డు సభ్యుల గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలి
-మాజీ మంత్రి మహేందర్
-వివిధ గ్రామాల్లో సర్పంచ్ మద్దతుగాఎన్నికల ప్రచారం
పెద్దేముల్ : తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘన త సీఎం కేసీఆర్ అని మాజీ మంత్రి మహేందర్ తెలిపారు. శనివారం మండల పరిధిలోని గాజీపూర్, బుద్దారం, గిర్మాపూ ర్, బండపల్లి గ్రామాల్లో టీఆర్ పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన పథకాలతో సుమారు 60 వేల మంది లబ్ధిపోందారని, రానున్న రోజుల్లో పథకాలు అమలు చేయడం జరుగుతుందని అన్నారు. ఒకప్పుడు నియోజకవర్గం లో 90 మంది సర్పంచ్ మాత్రమే ఉండేదని, ఇప్పుడు సు మారు 60 నూతన గ్రామ పంచాయతీలు ఏర్పడిన తర్వాత ఆ సంఖ్య 150కి చేరిందని అన్నారు. కాగా అందులో పెద్దేముల్ 19, బషీరాబాద్ 20, యాలాలలో 13, కోట్ 06 పంచాయతీలను నూతనంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో 19 సర్పంచ్ స్థానాలు మొదటి విడుతలో ఏకగ్రీవం కాగా 18 టీఆర్ 01 స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు. ఆగస్టు వరకు ఎన్నికల పర్వం కొనసాగుతుందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చిన గ్రామా గ్రామాన టీఆర్ పార్టీ అభ్యర్థులనే గెలిపించుకోవాలని, అందుకు నాయకులు, కార్యకర్తలు కష్టపడి పని చేయాలని ఆయన కోరారు.

త్వరలో ఆసరా పెన్షన్లు రెట్టింపు అవుతాయని, రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి సుమారు రూ.10వేలు రెండు పంటలకు కలిపి వస్తాయ ని, రైతు బీమా ద్వారా చనిపోయిన రైతుకు రూ.5లక్షలు ప్రభు త్వం అందిస్తుందన్నారు. యువకుడు కేటీఆర్ నాయకత్వంలో నిరుపేదలకు మరిన్ని సంక్షేమ పథకాలు రానున్నాయన్నారు. బుద్దారం గ్రామానికి ఎక్కువ మొత్తంలో జడ్పీ నిధులు వచ్చాయని గుర్తు చేశారు. ఖానాపూర్ గ్రామానికి సుమారు రూ.1 కో టి 40 లక్షలతో రోడ్డును నేనే స్వయంగా వేయించాయని మాజీ మంత్రి పేర్కొన్నారు. గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెం దాలంటే టీఆర్ బలపరచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ పి.నారాయణరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్ యాదవ్, యువ నాయకుడు రమేశ్ కుమా ర్ మాట్లాడుతూ మన గ్రామాల అభివృద్ధి జరుగాలంటే టీఆర్ పార్టీ సర్పంచ్ గెలిపించుకోవాలని, గతంలో చేసిన తప్పును సరిదిద్దుకొని సర్పంచ్ గెలిపించుకొని మాజీ మంత్రికి బహుమానంగా ఇవ్వాలన్నారు. సర్పంచ్ అభ్యర్థులను ఆశీర్వదించి భారీ మెజార్టీతో ఈ ఎన్నికలలో గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో సర్పం చ్ అభ్యర్థులు తలారి వీరప్ప, రామలక్ష్మమ్మ, శ్రీనివాస్ రాజు పటేల్, లాలప్ప, మాజీ సర్పంచ్ గ్రామ నాయకులు, యువ నాయకులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...