టీఆర్ బలపరచిన సర్పంచ్ గెలిపించండి


Sat,January 19, 2019 11:48 PM

తాండూరు రూరల్ : టీఆర్ పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తే, గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయని మాజీ మంత్రి పి.మహేందర్ తెలిపారు. పం చాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని కోటబాసుపల్లి, అంతారం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే రిజర్వేషన్ పదేండ్లు ఉంటే గ్రామాలు అభివృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం నేరుగా గ్రామాలకు నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. టీఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే మారుమూల గ్రామాలు అభివృద్ధి బాటపట్టాయన్నారు. సర్పంచ్ గెలిపిస్తే జడ్పీ నిధులతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని మాజీ మంత్రి హామీ ఇచ్చారు. జడ్పీటీసీ రవీందర్ మాట్లాడుతూ టీఆర్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే గ్రామాలు మరింత అభివృద్ధి సాధిస్తాయని తెలిపారు. నేరుగా పంచాయతీలకు నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఎంపీపీ కోస్గి లక్ష్మమ్మ మాట్లాడుతూ రైతు బీమా, రైతు బంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, వృద్ధులకు, దివ్యాంగులుకు పింఛన్లు, పూజారులకు, మసీదల్లో నమాజ్ చదివే ఇమామ్ కూడా వేతనాలు ఇస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, పార్టీ అధ్యక్షుడు జి.రాందాస్, సర్పంచ్ అభ్యర్థులు నాగార్జున, శాంతుకుమార్, నాయకులు పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...