అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం


Fri,January 18, 2019 11:45 PM

బొంరాస్ : గులాబీ జెండా నీడలోనే గ్రామాల సమగ్రాభివృద్ధి సాధ్యమని, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ బలపరిచిన అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ కోరారు. శుక్రవారం మండలంలోని జానకంపల్లి, మహాంతిపూర్ గ్రామాలలో టీఆర్ బలపరిచిన అభ్యర్థులు బొల్లు లక్ష్మి, బోయిని చంద్రమ్మలకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాలలో జరిగిన సభలలో ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ సర్పంచులు గెలిపిస్తే గ్రామాలలో ఎక్కువ అభివృద్ధి సాధ్యమని అన్నారు. ప్రభుత్వం నుంచి అధికంగా నిధులు మంజూరు చేయించి గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయిస్తానని చెప్పారు. జానకంపల్లి, మహాంతిపూర్ గ్రామాలకు ప్రభుత్వం బీటీ రోడ్డు మంజూరు చేసిందని ఎన్నికల తరువాత పనులు ప్రారంభిస్తామని చెప్పారు. గ్రామాలలో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు నిర్మిస్తామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం పేదల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు అందిస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా పెంచిన ఆసరా పింఛన్లు ఏప్రిల్ నుంచి అందిస్తామని, ఇంటి జాగా ఉన్న వారికి డబుల్ బెడ్ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. గ్రామాలకు అధికారులను పిలిపించి అపరిష్కృతంగా ఉన్న భూముల సమస్యలను పరిష్కరించి రైతుబంధు పథకం కింద పెట్టుబడి సహాయం అందజేస్తామని నరేందర్ హామీ ఇచ్చారు. జానకంపల్లి గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో పూజలు చేశారు. ఎమ్మెల్యేను గ్రామస్తులు సన్మానించారు. కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ మహేందర్ మాజీ జడ్పీటీసీ సభ్యుడు కోట్ల యాదగిరి, టీఆర్ పార్టీ నాయకులు శ్రీనివాస్ సురేందర్ చీమె నర్సింహులు పాల్గొన్నారు.

ఏకగ్రీవ సర్పంచ్ సన్మానం
బొంరాస్ మండలంలోని సండ్రకుంటతండా సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికైన లక్ష్మీబాయిని శుక్రవారం తండాలో టీఆర్ నాయకులు సీసీ వెంకటయ్యగౌడ్, చాంద్ వాహబ్, రాజునాయక్, నెహ్రూనాయక్ తదితరులు పూల మాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. వార్డు సభ్యులు, తండా ప్రజలు పాల్గొన్నారు.
దౌల్తాబాద్ : టీఆర్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించి గ్రామాల అభివృద్ధికి పునాది వేద్దామని ఎమ్మెల్యే పట్నం నరేందర్ పిలుపునిచ్చారు.శుక్రవారం దౌల్తాబాద్ మండలంలోని సంగాయిపల్లి, నందారం, కుప్పగిరి, యంకి, దేశాయిపల్లి, బిచ్చాల్, గుముడాల, సురైపల్లి గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆయన మాట్లాడారు. వెనుకబడిన కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.బొంరాస్ దౌల్తాబాద్, కొడంగల్ మండలాల అభివృద్ధి కోసం వందలాది కోట్ల రూపాయాలు వ్యయం చేయనున్నారని వెల్లడించారు. ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు, అంతర్గత రోడ్లు, ఇంటింటికి తాగునీరు, రైతుబంధు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, స్వయం ఉపాధి రుణాలు వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అన్ని గ్రామాల్లో టీఆర్ పార్టీ బలపర్చిన సర్పంచ్, వార్డు సభ్యులను భారీ మెజర్టీతో గెలిపించాలని కోరారు. గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న మోసపూరిత మాయమాటలు నమ్మావద్దని ప్రజలకు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు మోహన్ టీఆర్ మండల అధ్యక్షులు ప్రమోద్ రామకృష్ణ, మోహన్ నరోత్తంరెడ్డి, విద్యార్థి సంఘం నాయకులు కోట్ల మహిపాల్, సర్పంచ్ అభ్యర్థులు చంద్రకళ, లక్ష్మిదేవమ్మ, మధుసూదన్, కన్కిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...