హస్నాబాద్‌కు మండల హోదా సాధిస్తాం


Thu,January 17, 2019 11:28 PM

కొడంగల్, నమస్తే తెలంగాణ: హస్నాబాద్ గ్రామాన్ని నియోజకవర్గంలోనే ఆదర్శవంతమైన గ్రామపంచాయతీగా తీర్చిది ద్దుకోవడంతో పాటు మండల కేంద్ర హోదాను సాధించుకుం దామని జడ్పీటీసీ ముదిగిండ్ల ఎల్లమ్మ, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ముదిగిండ్ల కృష్ణలు అన్నారు. బుధవారం మండలంలోని హస్నాబాద్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ముదిగిండ్ల రవికుమార్ తరఫున మద్దతుదారులతో కలిసి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రతి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను సర్పంచ్ అభ్యర్థి ముదిగిండ్ల రవికుమార్ కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గ్రామ కూడలిలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ముదిగిండ్ల కుటుంబం 25 సంవత్సరాలుగా గ్రామాభివృద్ధికి పాటుపడుతూ, గ్రామ సర్పంచ్‌గా, జిల్లా వైస్ చైర్మన్‌గా, జడ్పీటీసీగా ఆయా పదవుల్లో ప్రజాసేవకు అంకితమైంద న్నారు. ప్రస్తుతం గ్రామంలోని అన్ని వీధుల్లో సీసీ రోడ్లు, ఇంటింటికీ తాగునీటి సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. ఈ మధ్య హస్నాబాద్‌ను మండల కేంద్రంగా ప్రకటించాలని సీఎం కేసీఆర్‌తో పాటు హరీశ్‌రావును కోరుతూ వినతి పత్రా లు ఇచ్చామన్నారు.

మండల కేంద్ర ఏర్పాటుకు వారు సుముఖంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో మొదటి సారిగా యువకుడు, విద్యావంతుడు రవికుమార్ (కత్తెరగుర్తు)పై పోటీ చేస్తున్నందున ప్రజలు అభివృద్ధిని గుర్తించి అభ్యర్థిని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో విజయం సాధించి పెడితే తప్పకుండా హస్నాబాద్‌ను మండల కేంద్రంగా ఏర్పాటు చేసే దిశగా పూర్తి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈనెల 21వ తేదీన జరిగే సర్పంచ్ ఎన్నికల్లో కత్తెర గుర్తుకు అధిక సంఖ్యలో ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే పోలింగ్‌లో గ్రామ ఓటర్లు పాల్గొనాలని వారు కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జాక శేకరయ్య, ఉస్మాన్‌తో పాటు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...