పల్లెల్లో ప్రచార హోరు


Mon,January 14, 2019 11:51 PM

- ఇంటింటికీ అభ్యర్థుల ప్రచారం ముమ్మరం
- తొలి విడుత ప్రచారానికి 19 వరకు గడువు
- తొలి విడుతలో తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల్లో
- 215 పంచాయతీలకు ఎన్నికలు
- జిల్లాలో 34 పంచాయతీలు ఏకగ్రీవం
-సర్పంచ్‌లు 580,వార్డు స్థానాలకు 3,684 మంది పోటీ
- రోజువారీ లెక్కలు చూపాలని ఎన్నికల కమిషన్ ఆదేశం
తాండూరు, నమస్తే తెలంగాణ: పల్లెల్లో మొదటి విడుత ప్రచారం హోరెత్తుతుంది. తొలి విడుతలో తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల్లోరి పంచాయతీల్లో అభ్యర్థులకు గుర్తులు కేటాయించడంతో ప్రచారంలో అభ్యర్థులు వేగం పెంచారు. గుర్తులను ఓటర్లకు వివరిస్తూ ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. బషీరాబాద్‌లో పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన పూడూరు ప్రియాంక తనకు కత్తెర గుర్తును కేటాయించడంతో ఆమె సోమ వారం కత్తెర పట్టుకొని ఓటర్లకు చూపిస్తూ ప్రచారం నిర్వహించారు. ఇలా పలుచోట్ల అభ్యర్థులు తమతమ గుర్తు వస్తువులతో ప్రచారానికి చేశారు. తాండూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి మహేందర్‌రెడ్డితో పాటు జడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థుల తరుఫున ప్రచారం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వారం రోజులపాటు నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం చేయనున్నారు. 100కు పైగా సర్పంచ్ స్థానాలను టీఆర్‌ఎస్ ఖాతాలో వేసుకోవాలని మాజీ మంత్రి గట్టి పట్టుదలతో ఉన్నారు. ఏకగ్రీవం తరువాత నియోజకవర్గంలో 127 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

జిల్లాలోని తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల్లో తొలి విడుత పంచాయతీల్లో మొత్తం 249 పంచాయతీల్లో 34పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. రెండు నియోజకవర్గాల్లోని ఏడు మండలాల్లోని 215 పంచాయతీల్లో సర్పంచ్‌లకు 580మంది పోటీలో ఉన్నారు. అలాగే వార్డులు 1822 స్థానాలకు 3684మంది పోటీలో ఉన్నారు. ఈనెల 21న తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల్లోని 215 పంచాయతీలకు జరిగే ఎన్నికల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యులు కలిపి 4264మంది పోటీ పడి తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. రెండు నియోజకవర్గాల్లో గతంలో 23 పంచాయతీలకు ( నామినేషన్ల ప్రక్రియ ముగిసే రోజు వరకు ) ఏకగ్రీవంగా ఎన్నికలు జరగ్గా ఆదివారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తరువాత మరో 11 పంచాయతీల్లో ఏకగ్రీవ సర్పంచ్‌లు ఎన్నికయ్యారు. జిల్లాలో మొత్తం 34 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని ఎన్నికల అధికారులు సోమవారం ప్రకటించారు. తాం డూరు నియోజకవర్గంలో మొత్తం 16 గ్రామాలు ఏకగ్రీవం కాగా కొడంగల్ నియోజకవర్గం లోని మూడు మండలాల్లో మొత్తం 18 గ్రామాల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యారు.

19 వరకు ప్రచారానికి గడువు...
అభ్యర్థులు రోజు వారి ఎన్నికల ప్రచారం ఖర్చులను ఎన్నికల అధికారులకు సమర్పించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ప్రతి రోజూ మండల ఎంపీడీఓ కార్యాలయంలో అభ్యర్థులు సాయంత్రం వరకు ఎన్నికల ఖర్చు వివరాల రోజువారీగా అందించాల్సి ఉంది. ఎన్నికలు ముగిసే 45 రోజుల్లోపు ఖర్చుల వివరాలు పూర్తిగా చూపకుంటే ఆయా అభ్యర్థులపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఎన్నికల ఖర్చును బ్యాంకు ఖాతాల ద్వారానే వెచ్చించాలని ఎన్నికల కమిషన్ సూచించింది. ప్రచారానికి ఆరు రోజుల గడువును మాత్రమే ఇచ్చారు. తొలి విడుత అభ్యర్థులు ఈనెల 19 తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం చేసుకోవచ్చు. 21న ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుంది.

134
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...