మెజార్టీ స్థానాలు గెలుస్తాం


Sun,January 13, 2019 11:57 PM

-తాండూరులో 12 పంచాయతీల్లో ఏకగ్రీవంగా టీఆర్ అభ్యర్థుల ఎన్నిక
-మొత్తంగా 100 గ్రామాల్లో విజయం సాధిస్తాం
-గ్రామాల్లో ప్రజలంతా టీఆర్
-రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం
-తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత సీఎం కేసీఆర్
-మాజీ మంత్రి మహేందర్
పెద్దేముల్ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ సర్పంచ్ స్థానాలను టీఆర్ పార్టీ కైవసం చేసుకుంటుందని మాజీ రవాణా శాఖ మంత్రి మహేందర్ ధీమా వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని టీఆర్ పార్టీ గ్రామ సర్పంచ్ అభ్యర్థి ద్యావరి విజయమ్మ ఇంట్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో మొదటివిడుతలో 143 గ్రామ పంచాయతీల్లో జరిగే ఎన్నికల్లో 100కు పైగా సర్పంచ్ స్థానాలను టీఆర్ కైవసం చేసుకుంటుందని ఆయన చెప్పారు. ఇప్పటికే నియోజకవర్గంలో 14 గ్రామాల్లోసర్పంచ్ స్థానాలు ఏకగ్రీవంగా కాగా అందులో 12 స్థానాలు టీఆర్ మద్దతుదారులేనన్నారు.

సీఎం కేసీఆర్ నమ్మకంతో పంచాయతీ ఎన్నికల్లో పథకాలను చూసి ప్రజలు టీఆర్ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. అందులో ఆసరా పింఛన్లు, రైతుబంధు,రైతు బీమా వంటి పథకాలు ఎన్నో ప్రజలను ఆకర్శించాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో నూతనంగా సుమారు 60 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయగా అందులో సుమారు తాండూరు నియోజక వర్గంలో 40కు పైగా గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశామన్నారు.తాండూరు నియోజకవర్గంలో బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లో నూతన పంచాయతీలుగా తండాలను ఏర్పాటు చేశామన్నారు, పెద్దేముల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్న ద్యావరి విజయమ్మను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన కోరారు. త్వరలో నాయకులతో జడ్పీ చైర్ సునీతారెడ్డి సమావేశం అవుతారని, ప్రతి గ్రామంలో నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించి అన్ని సర్పంచ్ స్థానాలను గెలుచుకోవాలని సూచించారు.

మహేందర్ సమక్షంలో పార్టీలో పలువురి చేరిక
గ్రామ సర్పంచ్ అభ్యర్థి ద్యావరి విజయమ్మ ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం అనంతరం పెద్దేముల్ తండాకు చెందిన మాజీ వార్డు సభ్యుడు చందర్ నాయక్, మాజీ పెద్దేముల్ గ్రామ వార్డు సభ్యురాలు గుడాల బాలమ్మ, తండాకు చెందిన లక్ష్మీబాయి రుక్కిబాయి, పన్నీబాయి, హూనిబాయి, కీరిబాయి, ఎల్లప్ప, సుందరప్ప, ఇతర గిరిజన మహిళలు సుమారు 50 మంది టీఆర్ మాజీ మంత్రి సమక్షంలో చేరారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ యువనాయకులు రమేశ్ విష్ణువర్ధన్ నర్సింలు, మాజీ సర్పంచ్ కిషన్ రావు, బాలప్ప, బుజ్జమ్మ, ఇతర మండల నాయకులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...