పశుగ్రాసం...సాగుచేద్దాం


Sun,January 13, 2019 11:54 PM

కులకచర్ల: వేసవిలో పశుగ్రాసం కొరత అధికంగా ఉం టుంది. పాడిపశువులకు పచ్చిమేత లభించక పాల ఉత్ప త్తి తగ్గుతుంది. తగినంత మేత దొరికితే రైతులు పాల ఉత్పత్తిని పెంచుకొని అధిక ఆధాయం పొందవచ్చు. ఇం దుకు బావులు, బోర్లకింద పశుగ్రాసం సాగుచేయాల్సి ఉంటుంది. ఇందుకు పశుసంవర్ధక శాఖ రైతులను ప్రో త్సహిస్తోంది. 50శాతం సబ్సిడీపై పశుగ్రాసం విత్తనాలను సరఫరా చేస్తోంది. పశుగ్రాసాల సాగు గురించి పశుసంవర్థక శాఖ అధికారుల సలహాలు వారి మాటల్లో చూద్దాం....
జిల్లాలో ఇప్పటికే సీఎస్ 24,ఎంఎఫ్ సర్టిఫైడ్ హైబ్రీడ్ విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. పశుసవర్థ్ధక శాఖ ఆధ్వర్యంలో అన్ని పశువైద్యకేంద్రాల్లో పశువుల మేతకు సంబంధించిన పశుగ్రాస విత్తనాలు అందుబాలులోఉన్నాయి. వీటినీ 50శాత సబ్సిడీపై ఇస్తున్నారు.
అనువైన భూములు....
పశుగ్రాసం అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు. ఇసుక, చౌడు నేలల్లోనూ వేసుకోవచ్చు. తేమ ఆమ్ల గుణాలు ఉన్న భూముల్లో పెరుగుదల ఉండదు.ఎకరా కు 10-20కిలోల విత్తనాలు కావాలి. మిశ్రమ పంటగా సాగుచేసినైట్లెతే ఎకరాకు 16కిలోల విత్తనాలు,సాళ్ల మధ్యలో చల్లడానికి3-5కిలోల అలసంద, పిల్లిపెసరలు అవసరమవుతాయి. అనువైన కాలం ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు ఉంటుంది. మొక్కకు 3-4 అంగుళాలు, సాల్లమధ్య 9-10అంగులాల అంతరం ఉండాలి.
ఎస్ జొన్న రకాన్ని ఇలా సాగుచేయాలి....
ఇది ఏపుగా, ఎత్తుగా అధిక పశుగ్రాసాన్ని ఇస్తుంది. ఖరీఫ్ సీజన్ దాదాపు 80-85 శాతం పచ్చిమేత అవసరం ఈ రకం వల్లనే తీరుతాయి. తక్కువ వర్షాపాతం ప్రాంతాల్లో సాగుచేసుకోవడానికి అనువుగా ఉంటుంది. మూడు, నాలుగు కోతలుగా దిగుబడి పొందవచ్చు.

ఎరువులు...
ఎకరాకు దుక్కిలో 10బండ్ల పశువుల ఎరువు, 22కిలో ల యూరియా, 16-20కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటాష్, 70కిలోల సూపర్ చల్లాలి. 40-45 రోజుల తర్వాత 22 కిలోల యూరియా వేయాలి.
నీటి తడి....
వేసవిలో 15రోజులకోసారి నీటి తడి ఇవ్వాలి. తద్వారా పచ్చిమేత పశువులకు వేయడానికి ఎపుగా పెరిగి ఉపయోగకరంగా ఉంటుంది.
మేత దిగుబడి....
మొదటి కోత 55-60 రోజులకు తదుపరి ప్రతి 45-50 రోజులకోసారి 3-4 కోతలు కోయాలి. ఎకరాకు 19-20 టన్నుల వరకు దిగుబడి ఉంటుంది.
అలసంద రకం....
వేసవిలో ఈ పశుగ్రాసాన్ని సాగుచేయవచ్చు. ఇది ఏకవార్షిక పశుగ్రాసం.ఇది తీగలా పైకి పెరుగుతూ కాండం పొడవుగా ఉండి మూడు ఆకులతో ఉంటుంది. ఇది మంచి పుష్టికరమైన పోషక విలువలు కలిగిన కాయజాతికి చెందిన పశుగ్రాసం. అన్నిరకాల భూముల్లో సాగుచేయవచ్చు. అన్నిరకాల అలసంద విత్తనాలు సరిపోతా యి. ఎకరాకు 15-20కిలోల విత్తనాలు అవసరం. మిశ్రమ పంటగా ఈ పంటను సాగుచేస్తే 6-8 కిలోల విత్తనాలు కావల్సి ఉంటుంది. ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు ఈ పశుగ్రాసాన్ని వేసుకోవచ్చు.
ైస్టెలో రకం...
ఈ మేత గొర్రెల, మేకల పోషణకు ఉపయోగపడే కాయజాతి పశుగ్రాసం. ఇది భూమికోతను అరికడుతుంది. పొలం గట్టమీద కూడా పండించి గట్టుకోతను అరికట్టవచ్చును. కంచెలు, బంజరు భూముల్లో పశుగ్రాసాన్ని పెంచుకోవచ్చు. తేలిక ఇసుకనేలలు, అత్యల్ప వర్షపాతం గల ప్రాంతాల్లో ఈ పశుగ్రాసాన్ని వేసుకోవచ్చు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...