రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం


Sat,January 12, 2019 11:40 PM

-ఫిర్యాదు దారులకు సరైన విధంగా సేవలందించేందుకు రిసెప్షన్ సెంటర్లు
-జిల్లా ఎస్పీ అన్నపూర్ణ
వికారాబాద్, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తూ ప్రజలకు శాంతి భద్రతలను కల్పిస్తుందని జిల్లా ఎస్పీ అన్నపూర్ణ తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్ సెంటర్లను ఆధునీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 5ఎస్ పద్ధతిలోని రిసెప్షన్ వర్టికల్స్ ప్రతి పోలీస్ స్టేషన్ అమలు అయ్యే విధంగా రిసెప్షన్ సెంటర్లను ఆధునీకరించడం జరిగిందని తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసినటువంటి రిసెప్షన్ సెంటర్ల ద్వారా పోలీస్ స్టేషన్లకు వచ్చేటటువంటి ఫిర్యాదు దారులకు స్నేహ పూర్వక వాతావరణం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పోలీస్ స్టేషన్ వచ్చే ఫిర్యాదుదారులు ఎలాంటి అసౌకర్యానికి లోనుకాకుండా తమ సమస్యలను పూర్తిగా తెలియజేయాలనే ఉద్దేశం తో రిసెప్షన్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

రిసెప్షన్ సెంటర్లలో ఫిర్యాదు దారులు వచ్చి కూర్చునే విధంగా సౌకర్యవంతమైన కుర్చీలు, మంచి నీటి సదుపాయం, న్యూస్ పేపర్ అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. ఫిర్యా దు దారులు వచ్చిన వెంటనే రిసెప్షన్ సెంటర్ పని చేసే సిబ్బంది వారి ఫిర్యాదులు తీసుకొని ఉన్నతాధికారులకు ఫిర్యా దు దారుల సమస్యలు తెలియజేసి ఫిర్యాదు దారుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ నమోదు చేయాలన్నారు. నమోదు చేసి వారి యొక్క కేసు వివరాలను ఎప్పటికప్పుడు ఎస్ రూపంలో తెలియజేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్క రిసెప్షన్ సిబ్బంది పోలీస్ పరంగా పొందే ప్రతి సేవలను ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో జిల్లాలోని అన్ని పీఎస్ రిసెప్షన్ సెంటర్లను అధునాతన సదుపాయాలతో ఆధునీకరించడం జరిగిందని, రిసెప్షనిస్టులు ప్రజలలో మంచి పేరు తెచ్చే విధంగా సేవలు అందించాలని సూచించారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...