రెండో విడుత నామినేషన్లు షురూ..


Sat,January 12, 2019 12:09 AM

-వికారాబాద్ నియోజకవర్గంలో 168 గ్రామ పంచాయతీలకు, 1,474 వార్డులకు ఎన్నికలు
-మర్పల్లి 2, బంట్వారం 2, కోట్ 2, వికారాబాద్ 1 ఏకగ్రీవం
-మొదటి రోజు సర్పంచ్ 229, వార్డులకు 410 నామినేషన్లు దాఖలు
-తొలిరోజు అభ్యర్థులు నామినేషన్ల కోలాహలం
-మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేందుకు ఎమ్మెల్యే ఆనంద్ కసరత్తు
వికారాబాద్, నమస్తే తెలంగాణ : రెండో విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా వికారాబాద్ నియోజకవర్గంలో నామినేషన్ల పర్వం మొదటి రోజు కోలాహల వాతావరణంలో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా గ్రామ ప్రజలతో కలిసి ఊరేగింపుగా అభ్యర్థులు వెళ్లి నామినేషన్లను దాఖలు చేశారు. అంతే కాకుండా ముఖ్యంగా వికారాబాద్ ఎమ్మెల్యే గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులను ఏక గ్రీవం చేసేందుకు తన వంతుగా కసరత్తు ప్రారంభించారు. గ్రామాల ప్రజలు ఐక్యమత్యంతో ముందుకు కదిలినప్పుడే అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుందని ఏక గ్రీవం చేసేందుకు ప్రజలకు నచ్చజెబుతున్నారన్నారు. గ్రామాల్లో నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రజల్లో రాజకీయ పండుగ వచ్చినట్లుగా సందడి కనిపిస్తుంది. వికారాబాద్ నియోజక వర్గం రెండోవిడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వాహణలో భాగంగా శుక్రవారం నామినేషన్ల పర్వం మొదలైంది. ఇందులో భాగంగా 168 గ్రామ పంచాయతీలలో ఇప్పటికీ 7 గ్రామ పంచాయతీలు ఏక గ్రీవం అయ్యాయి.

అందులో మర్పల్లి మండలం గుర్రంగట్టుతండా, నాగుసాన్ పెద్ద తండా, బంట్వారం మండలం నాగ్వరం, మద్వాపూర్, కోట్ మండలం బార్వాద్ తండా, లింగంపల్లి, వికారాబాద్ మండలం పాతూర్ సర్పంచ్ ఏకగ్రీవ తీర్మాణం చేశారు. ఇప్పటి వరకు వికారాబాద్ మండల పరిధిలో ఈసారి పాతూర్ మొదటి గ్రామపంచాయతీ ఏకగ్రీవం అయింది. గ్రామస్తులందరూ కలిసి దొడ్ల లలితమ్మను ఏకగ్రీవం సర్పంచ్ ఎన్నుకున్నారు. 161 గ్రామ పంచాయతీలకు ఎన్నిలకు జరుగనున్నాయి. అందులో భాగంగా శుక్రవారం 228 సర్పంచ్ నామినేషన్లు దాఖలు చేయగా 441 వార్డులకు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో భాగంగా ఎన్నికలు నిర్వహించేందుకు మూడు విడుతలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మొదటి విడతలో తాండూరు, కొడంగల్, రెండో విడతలో వికారాబాద్, మూడవ విడతలో పరిగిలో ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం అన్ని విధాలుగా సిద్ధమైంది.

ఇప్పటికే మొదటి విడుతలో తాండూరు, కొడంగల్ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై పూర్తి కావడం జరుగుతుంది. ఇకా రెండో విడుతలో వికారాబాద్ నియోజకవర్గంలో 168 గ్రామ పంచాయతీలకు, 1,474 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండోవిడుత ఎన్నికలు నిర్వహించే వికారాబాద్, దారూర్, మోమిన్ పేట్, మర్పల్లి, కోట్ బంట్వారం, నవాబుపేట్ మండలాల్లో ఎన్నికల సామాగ్రిని సిబ్బంది డీసీఎంలలో బ్యాలెట్ బాక్సులను వివిధ 40 రకాల సామాగ్రిని కేంద్రాలకు తరలించేందుకు సిద్ధం చేస్తున్నారు. నామినేషన్ పర్వం ముగిసిన అనంతరం బ్యాలెట్ పత్రాలు ఆయా గ్రామాలకు పంపిణీ చేయనున్నారు. అభ్యర్థుల సంఖ్యను బట్టి బ్యాలెట్ పత్రాలను పంపిణీ చేస్తారు. గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్లు వేసేందుకు రెండు మూడుగ్రామాలకు కలిపి ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి నామినేషన్లు స్వీకరిస్తారు. అందులో భాగంగా గ్రామ పంచాయితీల సంఖ్యను బట్టి క్లస్టర్ ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటు చేసిన క్లస్టర్లల్లో మాత్రమే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేటప్పుడు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా క్లస్టర్ల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. నామినేషన్ కేంద్రాలకు 5మంది కంటే మించకుండా అనుమతించకుండా అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటుంది.

రెండో దశ ఎన్నికల్లో భాగంగా
ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ..
జిల్లాలో రెండో విడుతలో వికారాబాద్ నియోజకవర్గంలోని 168 గ్రామ పంచాయతీలకు, 1,474 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. రెండో దశ ఎన్నికల్లో భాగంగా జనవరి13 వరకు నామినేషన్ల స్వీకరణ, 14న నామినేషన్ల పరిశీలన, 15న అభ్యంతరాల స్వీకరణ, 16న అభ్యంతరాలు పరిష్కరణ, 17న నామినేషన్ల ఉప సంహరణ అదే రోజు అభ్యర్థుల తుది జాబితా వెల్లడి జరుగుతుంది. 25న మధ్యాహ్నం 1 వరకు పోలింగ్, అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు, అ తరువాత ఫలితాలు విడుదల చేస్తారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్నివిధాల ఏర్పాట్లతో జిల్లా యంత్రాంగం పటిష్టంగా, పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధ మవుతుంది.

మొదటి రోజు మండలాల వారీగా నామినేషన్ల వివరాలు..
వికారాబాద్ 20 గ్రామ పంచాయతీలకుగాను పాతూర్ దొడ్ల లలితమ్మ ఏక గ్రీవం కాగా, 19 గ్రామ పంచాయతీలకుగాను 29 మంది సర్పంచ్ నామినేషన్లు దాఖలు చేయగా, 43 మంది వార్డు మెంబర్లకు నామినేషన్లు దాఖలు చేశారు. మోమిన్ మండలం 28గ్రామ పంచాయతీలకు గాను 54 మంది సర్పంచ్ అభ్యర్థులు, 98 మంది వార్డు సభ్యులకు నామినేషన్లు దాఖలు చేశారు. బంట్వారం మండలం 11 గ్రామ పంచాయతీలకుగాను మద్వాపూర్, నాగ్వరం రెండు గ్రామాలకు ఏకగ్రీవం అయ్యారు. 9 గ్రామ పంచాయతీలకుగాను 12 మంది సర్పంచ్ అభ్యర్థులుగా, 14 మంది వార్డు సభ్యులకు నామినేషన్లు దాఖలు చేశారు. కోట్ 18 గ్రామాలకు బార్వాద్ గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 16 గ్రామాలకు 25మంది సర్పంచ్ 26 మంది వార్డు సభ్యులకు నామినేషన్లు దాఖలు చేశారు. ధారూరు మండలంలో 32 గ్రామ పంచాయతీలకుగాను 31 మంది సర్పంచ్ 37 మంది వార్డు సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు. మర్పల్లి మండలంలో 27 గ్రామ పంచాయతీలకుగాను 42 మంది సర్పంచ్ 78 మంది వార్డు సభ్యులకు నామినేషన్లు దాఖలు చేశారు. నవాబుపేట మండలంలో 32 గ్రామ పంచాయతీలకుగాను 36 మంది సర్పంచ్ 114 మంది వార్డు సభ్యులకు నామినేషన్లు దాఖలు చేశారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...