ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతా!


Sat,January 12, 2019 12:06 AM

-సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్
-వందల కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తా..
-త్వరలోనే సాగునీరు అందిస్తాం..
-ఎమ్మెల్యే పట్నం నరేందర్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్
దౌల్తాబాద్ : వెనుకబడిన కొడంగల్ నియోజకవర్గాంలోని అన్ని గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చి దిద్దుతమని ఎమ్మెల్యే పట్నం నరేందర్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ అన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ మండలంలోని దేవర్ నంద్యాతండా, లొట్టిగుంట తండా, నాగసార్, సుల్తాన్ గ్రామాల్లో భారీ ర్యాలీతో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. వికారాబాద్ జిల్లాలో కొడంగల్ నియోజకవర్గం నుంచి బొంరాస్ దౌల్తాబాద్, కొడంగల్ మండలలా అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెట్టి వందల కోట్లా నిధులను ఖర్చు చేయడం జరిగిందని, ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు, అంతర్గ రోడ్లు, భగీరథ పథకంతో తాగునీరు, రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, వృద్ధులకు పెన్షన్లు, అన్ని వర్గాలకు కల్యాణ లక్ష్మి పథకం, మిషన్ కాకతీయా పథకంలో చెరువుల అభివృద్ధి, నిరుద్యోగలకు స్వయం ఉపాధి రుణాలు ఇలా ఏన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చూట్టి ప్రస్తుతం అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వ టీఆర్ అన్నారు.

దేశంలో రైతుల కోసం పెట్టుబడి పథకం మొట్టమొదటగా తెలంగాణలో మాత్రమే ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని బొంరాస్ దౌల్తాబాద్, కొడంగల్ మండలాలకు ఆర్ అండ్ బీ రోడ్లు, పంచాయతీ రోడ్లు అత్యధికంగా మంజూరు చేశామన్నారు. టీఆర్ ప్రభుత్వం నిరుపేదాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేశారు. రైతు రుణమాఫీ, ఒంటరి స్త్రీలకు పెన్షన్లు, కేసీఆర్ కిట్, వందల కోట్ల రూ. నిధులతో గొల్ల, కురుమ, యాదవుల అభివృద్ధి గొర్రెల పంపిణీ పథకం, బీసీ వర్గాలకు చెందిన వారికి రూ.4 వేల కోట్ల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఎన్నికల్లో ఇవ్వని హామీలు సైతం సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టినట్లు వివరించారు. రాష్ట్రంలో ప్రజలకు చెంతన పరిపాలన సౌలభ్యంతో వారిని అభివృద్ధిలో బాటలో నడిపెందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. టీఆర్ ప్రభుత్వంలోనే అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందుతున్నారన్నారు.

టీఆర్ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థులను గెలిపించాలని పిలుపు..!
మండలంలోని దేవర్ గ్రామంలో సునితమహిపాల్ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అలాగే మండలంలో టీఆర్ పార్టీ ప్రతిపాదించిన సర్పంచు, వార్డు సభ్యులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రతి గ్రామంలో టీఆర్ పార్టీకి అపూర్వ స్పందన ఉందన్నారు. సంక్షేమం అమలులో కొడంగల్ అత్యధిక నిధులతో అభివృద్ధి చేసే బాధ్యత తనపై నియోజవర్గ ప్రజలు ఉంచారన్నారు.

కాంగ్రెస్ నాయకుల మోసపూరిత మాటలు నమ్మావద్దు..!
గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ పార్టీపై చేస్తున్న మోసపూరిత మాటలు నమ్మావద్దని ఎమ్మెల్యే సూచించారు. కొడంగల్ గతంలో ఎమ్మెల్యేగా వున్న రేవంత్ సీఎం అవుతనని ప్రజల్లో ప్రచారం చేశారన్నారు. ఆయన సీఎం కాదు కాదా ఎమ్మెల్యే గెలిచే సత్తలేకుండా పోయారన్నారు. అసత్య ప్రచారం చేస్తే ప్రజలు ఏలా తిరస్కరించారో మీరు చూశారు కదా అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జట్పీటీసీ సభ్యుడు మోహన్ టీఆర్ మండల అధ్యక్షుడు ప్రమోద్ మండల టీఆర్ నాయకులు మోహన్ కోట్లా మహిపాల్ నరోత్తంరెడ్డి, టీఆర్ విద్యార్థి సంఘం నాయకుడు కోట్ల మహిపాల్ సర్సంచులు మధుసుధాన్ మధుసుధాన్ యాదవ్, రాంరెడ్డి, సోమయ్య, మంజూలాల్ నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

114
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...