జల్సాల కోసం చోరీలు


Thu,January 10, 2019 11:58 PM

వికారాబాద్, నమస్తే తెలంగాణ : పట్టణంలో ఈ నెల 7న మధ్యాహ్నం 12:15 గంటలకు చైన్‌స్నాచింగ్‌కు పాల్పడిన ఇద్దరు యువకులను సీసీ పుటేజ్‌ల ద్వారా పట్టుకొని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ శిరీష తెలిపారు. ఈ నెల 7న ఆలంపల్లికి చెందిన జి.చంద్రకళ మెడలోంచి రోల్డ్ గోల్డ్ చైన్‌కు అర తులం బంగారంతో ఉన్న చైన్‌ను ఇద్ద రు వ్యక్తులు బైక్‌పై వచ్చి పట్టణంలోని కాకతీయ స్కూల్ సమీపంలో మహిళ మెడలో నుంచి చైన్ లాక్కొని బైక్‌పై పరారయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని సీఐ సీతయ్య, ఎస్సై లక్ష్మయ్య బృందంతో కలిసి కాకతీయ స్కూల్, పట్టణంలోని నలువైపుల ఉన్న సీసీ పుటేజ్‌ల ఆధారంగా బైక్‌ను గుర్తించి వాహనాల తనిఖీలో వీరి ఆచూకి తెలుసుకొని ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొ ని విచారించగా దొంగతనం ఒప్పుకున్నారని ఆమె తెలిపారు. అదేవిదంగా వీరి వేలిముద్రలు తీసుకున్నట్లు తెలిపారు.

ఈ ఇద్దరు యువకులు వికారాబాద్‌కు చెందిన యువకులు ఓ డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. వికారాబాద్‌కు చెందిన ఎండి.ఖలీమోద్దీన్(20), మోముళ్ల విజయ్‌కుమార్(20) ఇద్దరు యువకులు జల్సాల కో సం సులువుగా డబ్బు సంపాదించాలని ఈ య త్నానికి పాల్పడినట్లు తెలిపారు. ఈ దొంగతనానికి ఇద్దరు వ్యక్తులు డిస్కవరి రెండ్, బ్లాక్ బైక్‌ను వినియోగించినట్లు తెలిపారు. పట్టణ ప్రజలు, షాపు యజమానులు ప్రతి ఒక్కరూ విధిగా కాలనీల్లో, ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాలనుఅ మ ర్చుకోవాలని డీఎస్పీ సూచించారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని తెలిపారు. నేరాలు అదుపు చేసేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతాయన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...