డబుల్ బెడ్ ఇండ్లు కట్టిస్తాం


Wed,January 9, 2019 11:23 PM

-పనులకు అడ్డంగా ఉన్న దేవాలయాలను తొలగించి మరోచోట నిర్మిస్తాం
-రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయాలి
-అధికారులతో కలిసి పనులను పరిశీలించిన కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్
బొంరాస్ : హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి నిర్మాణ పనుల వల్ల ఇండ్లు కోల్పోతున్న బాధితులకు డబుల్ బెడ్ ఇండ్ల్లు కట్టిస్తామని, భూములు నష్టపోయే వారికి నిబంధనల ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ అన్నారు. బుధవారం మండలంలోని తుంకిమెట్ల గ్రామంలో జాతీయ రహదారి నిర్మాణ పనులను ఆయన ఈఈ ధర్మారెడ్డితో కలిసి పరిశీలించారు. తుంకిమెట్ల గ్రామంలో రహదారి విస్తరణ పనుల వల్ల నష్టం జరిగే ఇండ్లను ఆయన పరిశీలించారు. రహదారి నిర్మాణం వల్ల తమ ఇండ్లకు నష్టం జరుగుతుందని ఆదుకోవాలని బాధితులు ఎమ్మెల్యేను కోరారు. నిబంధనల మేరకు నష్ట పరిహారంతో పాటు డబుల్ బెడ్ ఇండ్ల్లు కట్టిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తుంకిమెట్ల గ్రామంలో 500 మీటర్ల నాలుగు వరుసల రహదారిని నిర్మిస్తారని మధ్యలో సెంట్రల్ లైటింగ్ సిస్టం, డివైడర్లు పెట్టి గార్డెనింగ్ ఏర్పాటు చేస్తారని దీనివల్ల గ్రామం సుందరంగా కనిపించడంతో పాటు అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే అన్నారు. రోడ్డుకు ఇరువైపులా పాదచారులు నడవడానికి వీలుగా పుట్ నిర్మిస్తారని పుట్ టైల్స్ వేయాలని ఈఈ ధర్మారెడ్డికి సూచించారు.

పుట్ ఇరువైపులా మురుగు కాల్వలు కూడా నిర్మిస్తారని చెప్పారు. రహదారి నిర్మాణ పనులకు గ్రామంలో మూడుచోట్ల బోనమ్మ, వీరభద్ర దేవాలయం, పోచమ్మ దేవాలయాలు అడ్డుగా ఉన్నాయని వీటిని మరోచోటకు తరలించి దేవాలయాలను నిర్మిస్తామని నరేందర్ పేర్కొన్నారు. రోడ్డు వెడల్పు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. కోస్గిరోడ్డు కూడలిలో విస్తరణ పనులను ఎలా చేయాలో అధికారులతో చర్చించారు. గ్రామంలోని బీసీ కాలనీలో మిషన్ భగీరథ పైపులైను పనులు చేసే సమయంలో సీసీ రోడ్లు ధ్వంసమయ్యాయని, ప్రజలు నడవడానికి ఇబ్బందులు పడుతున్నారని కాలనీ ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ధ్వంసమైన సీసీ రోడ్ల స్థానంలో మళ్లీ సీసీ రోడ్లు నిర్మిస్తామని నరేందర్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఆయన వెంట మండల టీఆర్ పార్టీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ పార్టీ నాయకులు మధుయాదవ్, అంజిలయ్య, రాజేశ్వర్ మోనాచారి, జలీల్ తదితరులు పాల్గొన్నారు.

కొడంగల్ రహదారి పనుల పరిశీలన
కొడంగల్: కొడంగల్ పట్టణంలో జరుగుతున్న జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను బుధవారం ఎమ్మెల్యే పట్నం నరేందర్ పరిశీలించారు. రోడ్డు విస్తరణ పనుల వల్ల ఇల్లు కోల్పోయే వారికి డబుల్ బెడ్ ఇండ్ల్ల్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే చెప్పారు. ఆయన వెంటఈఈ ధర్మారెడ్డి, ఎంపీపీ ముద్దప్ప దేశ్ మండల పార్టీ అధ్యక్షుడు రాంరెడ్డి, మధుయాదవ్ పాల్గొన్నారు.

136
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...