మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలి


Wed,January 9, 2019 11:19 PM

-ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రతి ఉపాధ్యాయుడు శ్రమించాలి
-కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్
వికారాబాద్, నమస్తే తెలంగాణ : 10 వ తరగతి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు, జిల్లాకు ఫలితాల్లో ఉత్తమ ర్యాంక్ వచ్చేవిధంగా విద్యార్థులతో చక్కగా చదివించి, ప్రత్యేక తరగతులను తీసుకోవాలని వారిని పరీక్షలకు అన్నివిధాలుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు శ్రమించాలని జిల్లా కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ తెలియజేశారు. బుధవారం జిల్లాలోని ప్రధానోపాధ్యాయులతో వికారాబాద్ అంబేద్కర్ భవన్ 10వ తరగతిలో విద్యార్థులు మంచి మార్కులు సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలను తెలిపేందుకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వారి భవిష్యత్ మార్గదర్శకులుగా నిలవాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ప్రతి ఒక్కరూ పాసయ్యోవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గత సంవత్సరం కంటే ఉత్తీర్ణత శాతం పెరిగి జిల్లాకు రాష్ట్రంలో మెరుగైన స్థానం సాధించేలా అందరూ పని చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి రేణుకాదేవి మాట్లాడుతూ ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించి హాజరు శాతం పెరిగేలా ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.

ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు తప్పనిసరిగా సమయ పాలన పాటించాలని సూచించారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థలో ప్రతి ఒక్కరూ సరైన విధంగా పని చేసేందుకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయడం జరుతుందన్నారు. జిల్లాలో ప్రతి పాఠశాలలో బయోమెట్రిక్ ఖచ్చితంగా పాటించాలని సూచించారు. లేని పోని సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఉపాధ్యాయులు సరైన క్రమ శిక్షణతో ఉన్నప్పుడే విద్యార్థులు కూడా వారిని అనుసరించి సరైన మార్గంలో ముందుకు సాగి అభివృద్ధి సాధించేందుకు వీలు పడుతుందన్నారు. 2018-19 జిల్లా స్థాయి విద్యా గాణాంక వివరాలు పూరించుటకై సెక్టోరియల్ అధికారి నుస్రత్ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ నెల 10 అన్ని మండలాల్లో సమావేశాలు నిర్వహించి ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలని డీఈవో ఆదేశించారు. ఈ సమావేశంలో సెక్టోరియల్ అధికారులు, ఎంఈవోలు, ఎంఐఎస్, సీవోలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

106
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...