డీపీఆర్ బాధ్యతలు స్వీకరించిన పీసీ వెంకటేశం


Wed,January 9, 2019 11:19 PM

వికారాబాద్, నమస్తే తెలంగాణ : వికారాబాద్ జిల్లా డీపీఆర్ పీసీ వెంకటేశం బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ డీపీఆర్ పనిచేసిన నర్సింహులు పదవీ విరమణ పొందడంతో తాత్కాలిక ఇన్ డీవైఎస్ హన్మంతరావు బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో అడిషనల్ పీఆర్ పని చేస్తున్న పీసీ వెంకటేశం పదోన్నతిపై వికారాబాద్ పౌర సంబంధాల అధికారిగా ప్రభుత్వం ఇదివరకే ఉత్తర్వులు వెలువడించడం జరిగింది. బుధవారం ఆయన వికారాబాద్ డీపీఆర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి సహాకారంతో వికారాబాద్ జిల్లాలో సరైన విధంగా పని చేస్తామని తెలిపారు. ప్రభుత్వనికి ప్రజలకు అవసరమైన సమాచారం అందిస్తూ అందుబాటులో ఉంటూ అధికారుల సమన్వయంతో శాఖపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
జిల్లా ఎన్నికల పరిశీలకురాలిగా వాకాటి కరుణ.. వికారాబాద్ జిల్లాలో నిర్వహించనున్న ఎన్నికల్లో భాగంగా జిల్లా ఎన్నికల పరిశీలకురాలిగా వాకాటి అరుణను రాష్ట్ర ఎన్నికల అధికారి నియమించారు. జిల్లాలో నిర్వహించనున్న ఎన్నికలతీరు తెన్నులను ఎప్పటికప్పుడు ఆమె పరిశీలించి సరైన విధంగా జిల్లాలో ఎన్నిలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోనున్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...