కంటి సమస్యలు తీర్చేందుకే ‘కంటి వెలుగు’


Wed,January 9, 2019 11:18 PM

వికారాబాద్, నమస్తే తెలంగాన : కంటి సమస్యలు తీర్చేందుకు ‘కంటి వెలుగు’ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని వికారాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు అన్నా రు. బుధవారం వికారాబాద్ కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘కంటి వెలుగు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గ్రామీణ ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు కాబట్టి నిరుపేదలకు అవసరమయ్యే పథకాలను తీసుకువచ్చి వారికి ఎంతగానో మేలు చేకూరుతుందన్నారు. అంతేకాకుండా ‘కంటి వెలుగు’ ప్రతి ఒక్కరి కంటి సమస్యను తీర్చేందుకు ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో బార్ కౌన్సిల్ ప్రధాన కా ర్యదర్శి రమేశ్ సీనియర్ న్యాయవాదులు, న్యాయవాదులు, ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖ వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.
అంధత్వాన్ని నివారించవచ్చు..
కోట్ : అంధాత్వాన్ని పూర్తిగా నివారించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్ని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుధీర్ అన్నారు. మండలంలోని కొత్త పల్లి గ్రామంలో రెండో రోజు ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. 155 మంది వైద్య పరీక్షలు నిర్వహించగా 16 మందికి అద్దాలను అందించారు. 11 మందికి అద్దాల కోరకు రెఫర్ చేసిన్నట్లు తెలిపారు. మిగతా 17 మందికి శాస్త్రచికిత్సల కోసం తాండూరు, వికారాబాద్ దవాఖానలకు తరలించారు. కార్యక్రమంలో డీఆవో తకీయోద్దీ న్, కంటి నిపుణులు పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...