ధాన్యం కుప్పను ఢీకొని ఒకరి మృతి


Sat,October 20, 2018 11:25 PM

దుబ్బాక, నమస్తే తెలంగాణ : రోడ్డుపై నిల్వ చేసిన ధాన్యం కుప్పను ఢీకొని ఓ వాహనచోదకుడు మృతి చెందిన విషాద సంఘటన దుబ్బాక మండలం చౌదర్‌పల్లిలో శనివారం చోటుచేసుకుంది. ఈ సంఘటనపై భూంపల్లి ఎస్‌ఐ రాజేశ్ తెలిపిన వివరాలు..కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం బాగిర్తిపల్లె గ్రామానికి చెందిన కొటిది స్వామికి మిరుదొడ్డి మండ లంలోని కూడవెళ్లి గ్రామానికి చెందిన సౌమ్యతో గతేడాది కిందట వివాహం జరిగింది. అయితే, దసరా పండుగకు భార్య సౌమ్యతో కలిసి స్వామి అత్తగారిల్లు కూడవెళ్లి గ్రామానికి వచ్చాడు. కాగా, శుక్రవారం రాత్రి సెల్‌ఫోన్‌ను కొనుగోలు చేయడానికి దుబ్బాకకు బైక్‌పై వస్తున్నాడు. అయితే, మార్గమధ్యలో చౌదర్‌పల్లి గ్రామ సమీపంలో రోడ్డుపై రైతులు ధాన్యం కుప్పను ఏర్పాటు రాత్రివేళ ధాన్యం కుప్ప కనిపించకపోవడంతో స్వామి.. బైక్ అదుపుతప్పి ధాన్యం కుప్పను ఢీకొట్టడంతో తీవ్రం గా గాయపడ్డాడు. వెంటనే సిద్దిపేట దవాఖానకు తరలిస్తుండగా స్వామి మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని దుబ్బాక దవాఖానకు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...