తహసీల్దార్‌కు ఘనంగా వీడ్కోలు


Wed,October 17, 2018 11:09 PM

నవాబుపేట : తహసీల్దార్ శ్రీనివాస్‌కు స్థాన చలనం కలిగినందుకు తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది బుధవారం కార్యాలయంలో వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆయన సేవలను కొనియాడారు. తహసీల్దార్‌గా కొన్ని నెలల పాటు పని చేసిన ఆయన రెవెన్యూ పరమైన సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేశార న్నారు. అంతే కాకుండా ఆయనకున్న అనుభవంతో జఠిలమైన సమస్యల ను పరిష్కారం చేసి మండల ప్రజలకు ఎంతగానో మేలు చేశారని చెప్పారు. సిబ్బందితో ప్రేమ పూర్వకంగా పనులు తీసుకున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో డీటీ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌ఐ పద్మ, జూనిర్ అసిస్టెంట్ రవీందర్‌రెడ్డి, వీఆర్వోల సంఘం అధ్యక్షుడు విజయభాస్కర్, వీఆర్వోలు చాంద్‌పాషా, రాములు, పద్మారావు, రాజు, మహమ్మద్, నర్సింహులు, వీఆర్‌ఏలు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తహసీల్దార్ శ్రీనివాస్ స్థానంలో మండల తహసీల్దార్‌గా సంగారెడ్డి జిల్లా నుంచి వచ్చిన ఆశ్వక్స్రూల్ బాధ్యతలు తీసుకున్నారు.

107
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...