రక్తదానం గొప్పదానం


Tue,October 16, 2018 11:26 PM

వికారాబాద్, నమస్తే తెలంగాణ : ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నవారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు రక్తదానం చేయాల్సిన అవసరమని జిల్లా ఎస్పీ అన్నపూర్ణ అన్నారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో 21న నిర్వహించనున్న అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్పీ కార్యాలయ ఆవరణలో రక్తదాన శిబిరం, పోలీసులు వినియోగించి తుపాకీలు, వివిధ సామాగ్రిపై ఓపెన్‌హౌస్‌ను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రమాదాల్లో గాయపడిన వారికి అందుబాటులో అవసరమైన రక్తనిల్వలు లేకపోవడంతో మృత్యువాత పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు విధిగా రక్తదాన చేయాలని కోరారు. ఈ శిబిరంలో 22 మంది స్వచ్ఛందంగా రక్తం దానమిచ్చారని ఆమె తెలిపారు. అమర వీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, తదితర పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.

జిల్లాకు కొత్తగా పోలీస్ వాహనాలు
వికారాబాద్ జిల్లాకు 24 కొత్తగా పోలీస్ వాహనాలు వచ్చినట్లు తెలిపారు. 792 బ్లూకోడ్స్ వాహనాలు ఇచ్చారని ఎస్పీ తెలిపారు. పోలీస్ అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ సంస్మరణ వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఓపెన్‌హౌస్‌లో విద్యార్థులకు తుపాకులు, శాట్‌వెపన్స్, బాంబుడిస్పోజబుల్ పరికరాలు పోలీసులు వాడే ఆయుధాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 268 లైసెన్సుడ్ వెపన్స్ ఉన్నట్లు తెలిపారు. వీటన్నింటిని డిపాజిట్ చేయించుకున్నట్లు తెలిపారు. 8 మంది బ్యాంక్ సిబ్బంది దగ్గర ఆయధాలు ఉన్నట్లు తెలిపారు. ఎన్నికలను దృష్ఠిలో పెట్టుకొని 700 మందిని బైండోవర్ చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో రౌడీ షీటర్స్, ఎన్నికల కేసులు ఉన్నట్లు తెలిపారు. నూతనంగా వచ్చిన వాహనాలకు వీడియో కెమెరాలు అమర్చి కమ్యునికేషన్ విధానాన్ని కల్పించి జీపీఎస్ సెట్టింగ్ చేసి జిల్లాలో ఎలాంటి సంఘటనలు జరిగిన వెంటనే అప్రమత్తం అయ్యే విధంగా చర్యలు తీసుకునేందుకు ఇవి ఎంతగానో దోహదపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నర్సింహులు, డీఎస్పీ శిరీష, వికారాబాద్ సీఐ సీతయ్య, ఎస్‌బీఐ వెంకటేశ్వర్లు, రవికుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

111
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...