ప్రజల నుంచి అనూహ్య స్పందన


Mon,October 15, 2018 11:43 PM

-కొడంగల్‌లో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయం
-నియోజకవర్గంలో కనీవినీ ఎరుగని అభివృద్ధి చేస్తా : పట్నం నరేందర్‌రెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ :
కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ ప్రచార హోరు స్పీడందుకుంది. గెలుపే లక్ష్యంగా రంగంలోకి దిగిన కొడంగల్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచార ప్రభంజనం కొనసాగుతున్నది. కొడంగల్ నియోజకవర్గంలోని ఏ గ్రామానికి వెళ్లినా టీఆర్‌ఎస్ అభ్యర్థికి అన్ని వర్గాల ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి గతంలో ఎన్నడూలేని విధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం భారీ ఎత్తున నిధులను విడుదల చేసి అభివృద్ధిలోకి తీసుకువచ్చిన ప్రధాన అం శంతోపాటు టీఆర్‌ఎస్ ప్రభు త్వం అమలుచేసిన సంక్షేమ పథకాలను ఆ పార్టీ అభ్యర్థి ప్రచార అస్ర్తాలుగా చేసుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. అదేవిధంగా నియోజకవర్గంలోని బొంరాస్‌పేట్, కొడంగల్, మద్దూరు, కోస్గి, దౌల్తాబాద్ మండలాల్లో ఎక్కడ ప్రచారం నిర్వహించినా అభ్యర్థికి మద్దతుగా తరలివస్తున్న జనాలను చూస్తుంటే కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ చరిత్ర సృష్టించడం ఖాయమనిపిస్తున్నది. 20రోజులుగా సాగుతున్న ప్రచారంలో ప్రజల స్పంద న ఎలా ఉంది, తదితర విషయాలపై కొడంగల్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డితో నమస్తే తెలంగాణ ప్రతినిధి ప్రత్యేక ఇంటర్వ్యూ....

నమస్తే తెలంగాణ : ఎన్నికల ప్రచారం ఎలా సాగుతున్నది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తున్నది ?
టీఆర్‌ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి : కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలందరూ టీఆర్‌ఎస్ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఏ గ్రామానికి, ఏ తండా కు వెళ్లినా ప్రజలు ఆదరిస్తూ అండ గా నిలుస్తున్నారు. అంతేకాకుండా గ్రామగ్రామాలన్ని ఐక్యంగా మేమంతా టీఆర్‌ఎస్ వెంటే అంటూ మద్దతిస్తూ ప్రమాణాలు చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని సుమారు 30గ్రామాల ప్రజలు మూకుమ్ముడిగా మద్దతు తెలుపుతూ అండగా నిలిచారు. యువకులు మొదలుకొని వృద్ధులు, మహిళలు ఇలా అందరి నుంచి మంచి స్పందన వస్తున్నది. ఈ దఫా కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరు.

నమస్తే తెలంగాణ : మీరు గెలిస్తే నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు ?
టీఆర్‌ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి : కొడంగల్ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూలేని విధంగా అభివృద్ధి జరిగింది. పూర్తిగా వెనుకబడిన కొడంగల్ నియోజకవర్గాన్ని కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదే. నియోజకవర్గ ప్రజలకు మాయ మాటలు చెప్పి కాలం వెల్లదీస్తున్న నాయకులకు బుద్ధి వచ్చేలా నియోజకవర్గానికి ఏడాది కాలం లో రూ.300 కోట్ల నిధులను విడుదల చేసి కొడంగల్ అభివృద్ధికి టీఆర్‌ఎస్ పార్టీ నాందీ పలికింది. అయితే కొడంగల్ నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే, కొడంగల్‌ను మరో సిద్ధిపేటలా అభివృద్ధి చేస్తా. అంతేకాకుండా కొడంగల్ నియోజకవర్గానికి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో సాగునీరు తీసుకువస్తా. అయితే టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో కొడంగల్‌తోపాటు కోస్గిలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసి, ఒక్కో మున్సిపాలిటీకి రూ.15కోట్ల చొప్పున నిధులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం విడుదల చేసింది. కొడంగల్‌లో బస్‌డిపోతోపాటు బస్టాండ్ ని ర్మాణానికి రూ.4 కోట్ల నిధులను, కోస్గిలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంతోపాటు అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు నిధు లు మంజూరై పనులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా మద్దూ రు బస్టాండ్‌కు రూ.60లక్షలు తీసుకువచ్చింది. మిషన్ కాకతీయలో భాగంగా 140 చెరువులను పునరుద్ధరణ, రైతుబంధు పథకంలో భాగంగా 37,810 మంది రైతులకు రూ.47 కోట్ల పెట్టుబడి సాయమందించడంతోపాటు రూ.167 కోట్లతో మిషన్ భగీరథ పనులు చివరి దశలో కొనసాగుతున్నాయి.

నమస్తే తెలంగాణ : ఏయే వర్గాల ప్రజల నుంచి మీకు మద్దతు లభిస్తున్నది ?
టీఆర్‌ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి : కొడంగల్ నియోజకవర్గంలోని ఏ గ్రామంలో ప్రచారం నిర్వహించినా సబ్బండ వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నది. ఎక్కడెళ్లినా రైతులతోపాటు గొల్ల, కుర్మలు, మత్స్యకారుల కుటుంబాలు, మైనార్టీల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నది. ఎక్కడ ప్రచారం చేసినా భారీగా తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారు. అంతేకాకుండా షాదీముబారక్ వంటి పథకాలతోపాటు పేద ముస్లిం, మైనార్టీల కోసం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడం వంటి అంశాలతో మైనార్టీలంతా టీఆర్‌ఎస్‌వైపే ఉన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్, టీడీపీల నుంచి భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీలోకి చేరుతున్నారు.

నమస్తే తెలంగాణ : మహాకూటమిపై మీ స్పందన ?
టీఆర్‌ఎస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి : మహాకూటమితో ఒరిగేదేమీ లేదు. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్‌తోపాటు ప్రతిపక్షాలన్నీ ఒక్కటైనా నష్టమేమీలేదు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపు ఖా యం. మహాకూటమిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పాటైన టీడీపీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా లేఖ రాసి అడ్డుకునేందుకు యత్నించి, ప్రస్తుతం అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణకు మళ్లీ అన్యాయం చేసేందుకే కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. 60ఏండ్ల్లకుపైగా నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్, టీడీపీలను తిరిగి గెలిపిస్తే మనకు మళ్లీ అన్యాయం చేసి మరోసారి మో సగించేం దుకు సిద్ధంగా ఉన్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే తెలంగాణలో అభివృద్ధి కుంటుపడడంతోపాటు రైతుల పరిస్థితి దారుణంగా మారుతుంది.

130
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...