రైతుబంధుకు సన్నాహాలు


Sun,October 14, 2018 11:31 PM

-రైతుల వివరాలు, బ్యాంకు ఖాతాలుసేకరిస్తున్న అధికారులు
-వచ్చే నెల మొదటి వారంలో రెండో విడుత పెట్టుబడి డబ్బులు
-నేరుగా రైతుల ఖాతాల్లో జమ
-జిల్లాలో 1.95లక్షల మంది రైతులకురూ.223 కోట్లు
వికారాబాద్, నమస్తే తెలంగాణ : తెలంగాణ ప్రభు త్వం రైతాంగానికి ఆపన్నహస్తం అందించి అన్ని విధాలుగా ఆదుకుంటున్నది. వారి అభివృద్ధికి దోహదం చే స్తున్నది. అందులో భాగంగా రైతులు పంటలు వేసు కునే సమయంలో అనేక ఇబ్బందులకు గురై అప్పుల పాలవుతూ విత్తనాలు విత్తుకుంటున్నారని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధుతో రైతుకు పెట్టు బడి సహాయం అందించి కొండంత ఆత్మైస్థెర్యం నిం పేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అందులో భాగంగా భూ ప్రక్షాళన నిర్వహించి సరైన విధంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసి, జిల్లా లో 2.24 లక్షల రైతు ఖాతాలను సరైన విధంగా చేయడం జరిగింది. ఇందులో భాగంగా రూ.243 కోట్లను రైతులకు చెల్లించేందుకు నిర్ణయించారు. జిల్లాలో ఈ రైతు బంధుతో ఎకరాకు రూ.4వేలు కలిపి,వానా కాలం, యాసంగి పంటలకు పంట పెట్టుబడి సహా యం అందించేందుకు మార్గనిర్దేశం చేయడం జరిగింది. అందులో భాగంగా వానాకాలంకు మే 10న రైతు బంధు పథకంద్వారా వికారాబాద్ జిల్లాలో 1.95 లక్షల మంది రైతులకు రూ.223 కోట్లను చెల్లించింది. కొన్ని రైతు ఖాతాలు సరైన విధంగా లేకపోవడంతో 2.24 లక్షల రైతుల ఖాతాలకు గాను, 1.95లక్షల మంది రైతులకు చెక్కులను ప్రభుత్వం అందించింది.

రెండో విడుతలో..
గతంలో రైతు బంధు పథకం ద్వారా అందించినటువంటి రైతులకే రైతుబంధు పథకంలో పంట పెట్టుబడి సహాయం అందించేందుకు అధికార యంత్రాంగం నిమగ్నమై ఉంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున గతంలో ఇచ్చిన రైతులకు మాత్రమే రైతు బంధు ద్వారా డబ్బులను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ పంట పెట్టుబడి సహాయం కూడా గతం లో చెక్కుల మాదిరిగా కాకుండా నేరుగా రైతు ఖాతాల్లోకే మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకుగాను ఈనెల 5 నుంచి రైతు పూర్తి వివరాలు, బ్యాంక్ ఖాతాలు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లా లో 30వేలకు పైగా రైతు ఖాతాలను, అన్ని వివరాలను సేకరించారు. ఈ రైతుల వివరాలను ఖాతాలను ఈ నెల 25 వరకు సేకరణ చేసి పూర్తి వివరాలన్నింటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేందుకు వ్యవసాయాధికారులు పూర్తిగా రైతు బంధు పథకం అందించేందుకు కార్యచరణలో ముమ్మరంగా నిమగ్నమై ఉన్నా రు. ఈ అప్‌లోడ్ చేసిన రైతు ఖాతాల్లో వచ్చే నెల మొదటి వారంలో నేరుగా డబ్బులు జమ చేసేందుకు అధికార యంత్రాంగం పూర్తిగా కసరత్తు చేసి సిద్ధంగా ఉంది.

రైతుల బతుకులకు బంగారుబాట
తెలంగాణ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి వ్యవసాయమంటే దండుగ కాదు, పండుగ అనేలా రైతు శ్రేయోభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ బృహత్తర పథకాలు ప్రవేశపెట్టి, రైతు పక్షపాతిగా నిలిచి వారి గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. ఇతర రాష్ర్టాలు సైతం మన పథకాలను చూసి వారి వారి రాష్ర్టాల్లో అమలుచేసేందుకు ఉత్సాహం కనబరు స్తున్నారు. ముఖ్యంగా రైతులు పంటలు విత్తుకున్నప్పటి నుంచి ఎరువులు, మందులు, విత్తనాలు సబ్సిడీపై అందించడమే కాకుండా పండించిన పంటలకు గిట్టుబాటు ధరలకు ఎలాంటి మోసాలకు తావులేకుండా ప్రభుత్వం ద్వారానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి లాభం చేకూరే విధంగా పకడ్బందీగా ప్రణాళిక బద్ధంగా కార్యాచరణను నడిపించారు. అంతే కాకుండా రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి వారికి కొండంత భరోసానిచ్చారు. రైతులు గతంలో ఎప్పుడుపడితే అప్పుడు పొలాలకు వెళ్లి నీరు మళ్లింపులో దిక్కులేని చావులు చచ్చేవారు. 24 గంటల ఉచిత కరెంట్‌తో ఆ చావులకు తెలంగాణ ప్రభుత్వం ఫుల్‌స్టాప్ పెట్టేసింది. రైతులు దర్జాగా పంటలకు నీరు మళ్లిస్తూ ఆనందంతో ఉన్నారు. అంతే కాకుండా రైతు కుటుంబాలకు భరోసానిచ్చేందుకు రైతు బీమాను తీసుకొచ్చి రైతులు ఏ కారణం చేతనైనా మరణిస్తే ఆ కుటుంబానికి రూ. 5లక్షల బీమా అందించి వారి కుటుంబాలకు బాసటగా నిలువడం జరుగుతున్నది.


వచ్చే నెల మొదటి వారంలో రైతుల ఖాతాల్లోకి రైతుబంధు డబ్బుల జమ
జిల్లాలో రైతుల ఖాతాలను వారి పూర్తి వివరాలను ఈ నెల 5 నుంచి 25 వరకు సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎన్నికల నిబంధనల వల్ల గతంలో ఇచ్చిన రైతులకు మాత్రమే ఈ రైతు బంధు డబ్బులను జమ చేసేందుకు చర్యలు తీసుకుంట్నుము. వానాకాల సీజన్‌లో 1.95లక్షల మంది రైతులకు రూ.223 కోట్లను చెక్కులను రైతులకు పంట పెట్టుబడి సహాయం కింద అందించడం జరిగింది. జిల్లాలో మొత్తానికి 2.24లక్షల రైతు ఖాతాలు ఉన్నాయి. ఇందుకు గాను వానాకాలంలో రూ.243 కోట్లు అందించాల్సి ఉండగా రూ.223 కోట్లు అందించడం జరిగింది. కొన్ని కారణాల వల్ల కొంత మంది రైతు ఖాతాలకు అందించలేదు. ఇప్పటివరకు రైతుల వివరాలు, ఖాతాలను 30వేల మందికి పైగా సేకరించడం జరిగింది. సెలవులు రావడంతో సేకరణలో కొంత అంతరాయం ఏర్పడింది. ఈ నెల 25వరకు పూర్తిగా రైతుల ఖాతాలు, వివరాలను సేకరణ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. దీంతో వచ్చే నెల మొదటి వారంలో నేరుగా కమిషనరేట్ నుంచే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుంది.
- జిల్లా వ్యవసాయాధికారి గోపాల్

172
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...