బురాన్‌పూర్‌లో ఘనంగా బతుకమ్మ సంబురాలు


Sun,October 14, 2018 11:29 PM

బొంరాస్‌పేట: మండలంలోని బురాన్‌పూర్ గ్రామం లో ఆదివారం బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. పొదుపు సంఘాల మహిళలు వివిధ రకాల పూలతో అందంగా బతుకమ్మలను తయారు చేశారు. వాటిలో గౌరమ్మలను ప్రతిష్ఠించి భక్తితో పూజించారు. అనంతరం బతుకమ్మలను ఓ చోట ఉంచి మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాటలు పాడుతూ బతుకమ్మ ఆటలు ఆడారు. బతుకమ్మలను ఎత్తుకుని గ్రా మంలో ర్యాలీ నిర్వహించారు. సాయం త్రం చెరువులో నిమజ్జనం చేశారు. రెండవ గ్రామ సంఘం నాయకులు లక్ష్మీ,బసమ్మ, దేవేంద్రమ్మ, పార్వతమ్మ, ఈరమ్మ, జయమ్మ, హన్మమ్మ, సీసీ విజయ కుమార్, వీవోఏ నర్సింహులుగౌడ్, మహిళలు పాల్గొన్నారు.

119
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...