జిల్లాలో ఓటర్లు 8,26,786


Sat,October 13, 2018 11:27 PM

-ఓటర్ల తుది జాబితాను విడుదల చేసిన ఎన్నికల సంఘం
-పురుషులు 4,14,717,మహిళలు 4,11,682
-అత్యధికంగా పరిగిలో 2,26,072 ఓటర్లు
-అత్యల్పంగా కొడంగల్‌లో 1,97,439 మంది
-ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంతో కొత్త ఓటర్లుగా 29,145
-తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికం
-వికారాబాద్‌లో 1,97,439 మంది ఓటర్లు
-తాండూరులో 1,99,755 మంది ఓటర్లు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లాకు సంబంధించి ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. జిల్లాలో 8,26,786 మంది ఓటర్లున్నట్లు ఎన్నికల సంఘం తేల్చింది. అయితే జిల్లాలోని పరిగి నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు ఉండగా, కొడంగల్ నియోజకవర్గంలో అత్యల్పంగా ఓటర్లు ఉన్నారు. మరోవైపు తాండూరు, కొడంగల్ నియోజకవర్గంలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. అదేవిధంగా సెప్టెంబర్ 10వ తేదీనుంచి 25 వరకు నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంతో 29,145 మంది కొత్త ఓటర్లుగా జాబితాలో చేరారు. అంతేకాకుండా ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంతో తాండూరు నియోజకవర్గంలో అత్యధికంగా ఓటర్లు పెరుగగా, అత్యల్పంగా వికారాబాద్ నియోజకవర్గంలో కొత్త ఓటర్లుగా నమోదయ్యారు. అయితే సెప్టెంబర్ 10న రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటరు ముసాయిదా జాబితా ప్రకారం జిల్లావ్యాప్తంగా 7,97,641 మంది ఓటర్లు ఉండగా,...ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంతో 8,26,786 మంది ఓటర్లుకు పెరగడం జరిగింది. అయితే ఓటరు తుది జాబితాను ఈనెల 8వ తేదీనే ప్రకటించాల్సి ఉన్నప్పటికీ, హైకోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో శుక్రవారం రాత్రికి ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది.

జిల్లావ్యాప్తంగా 8,26,786 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల అధికారులు తేల్చారు. వీరిలో పురుషులు 4,14,717 మంది ఉండగా, మహిళా ఓటర్లు 4,11,682 మంది, ఇతరులు 61 మంది ఓటర్లు, సర్వీస్ ఎలక్టర్స్ 326 మంది ఉన్నారు. అత్యధికంగా పరిగి నియోజకవర్గంలో 2,26,072 మంది ఓటర్లున్నారు, వీరిలో పురుషులు 1,15,450 మంది ఓటర్లు, మహిళా ఓటర్లు 1,10,460 మంది, ఇతరులు 10 మంది ఓటర్లు, సర్వీస్ ఎలక్టొర్స్ 147 మంది ఓటర్లున్నారు. అదేవిధంగా వికారాబాద్ నియోజకవర్గంలో 2,03,520 మంది ఓటర్లుండగా, పురుషులు 1,03,190 మంది ఓటర్లు, మహిళా ఓటర్లు 1,00,267 మంది ఓటర్లు, ఇతరులు 15 మంది ఓటర్లు, సర్వీస్ ఎలక్టోర్స్ 48 మంది ఉన్నారు. తాం డూరు నియోజకవర్గంలో 1,99,755 మంది ఓటర్లుండగా, వీరిలో పురుషులు 97,746 మంది ఓటర్లు, మహిళా ఓటర్లు-1,01,969 మంది ఓటర్లు, ఇతరులు-11 మంది ఓటర్లు, సర్వీస్ ఎలక్టొర్స్-29 మంది ఓటర్లున్నారు.

అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గంలో 1,97,439 మంది ఓటర్లుండగా వీరిలో పురుషులు 98,331 మంది ఓటర్లు, మహిళా ఓటర్లు-98,986 మంది ఓటర్లు, ఇతరులు-20 మంది ఓటర్లు, 102 మంది సర్వీస్ ఎలక్టొర్స్ ఓటర్లు ఉన్నట్లు సంబంధిత అధికారులు తేల్చారు. అయితే జిల్లాలోని తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల్లో పురుషులకంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. తాండూరు నియోజకవర్గంలో పురుషులు-97,746 మంది ఓటర్లుండగా, పురుషుల కంటే 4223 మంది అదనంగా 1,01,969 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గంలో 98,331 మంది పురుషులు ఉండగా, 655 మంది అదనంగా 98,986 మంది మహిళా ఓటర్లు కొడంగల్ నియోజకవర్గంలో అధికంగా ఉన్నారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 10 నుంచి 25 వరకు వరకు నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంతో జిల్లాలో కొత్తగా 29,145 మంది ఓటర్లు ఓటరు జాబితాలో కొత్తగా చేరారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కొత్తగా చేరిన వారిలో అత్యధికంగా తాండూరు నియోజకవర్గంలో కొత్త ఓటర్లుగా చేరగా, వికారాబాద్ నియోజకవర్గంలో అత్యల్పంగా కొత్త ఓటర్లు చేరారు. ఆయా నియోజకవర్గాల్లో కొత్త ఓటర్లుగా చేరిన వారిలో పరిగి నియోజకవర్గంలో 7986 మంది ఓటర్లు, వికారాబాద్ నియోజకవర్గంలో 3403 మంది ఓటర్లు, తాండూరు నియోజకవర్గంలో 9395 మంది ఓటర్లు, కొడంగల్ నియోజకవర్గంలో 8361 మంది ఓటర్లు కొత్తగా ఓటరు జాబితాలో చేరారు.

అదేవిధంగా సెప్టెంబర్ 10న ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటరు ముసాయిదా జాబితా ప్రకారం గత నెల 10 వరకు జిల్లాలోని ఓటర్ల వివరాలకు సంబంధించి,...జిల్లావ్యాప్తంగా 7,97,641 మంది ఓటర్లుండగా,...వీరిలో పురుషులు 4,02,001 మంది ఓటర్లు, మహిళా ఓటర్లు-3,95,270 మంది ఓటర్లు, ఇతరులు-53 మంది ఓటర్లు, సర్వీస్ ఎలక్టొర్స్-317 మంది ఓటర్లున్నారు. అదేవిధంగా ముసాయిదా జాబితా ప్రకారం పరిగి నియోజకవర్గంలో 2,18,086 మంది ఓటర్లుండగా,...వీరిలో పురుషులు-1,11,902 మంది, మహిళా ఓటర్లు-1,06,030 మంది ఓటర్లు, ఇతరులు-11 మంది ఓటర్లు, సర్వీస్ ఎలక్టొర్స్-143 మంది ఓటర్లున్నారు. వికారాబాద్ నియోజవర్గంలో 2,00,117 మంది ఓటర్లుండగా,...వీరిలో పురుషులు-1,02,265 మంది ఓటర్లు, మహిళా ఓటర్లు-97,793 మంది ఓటర్లు, ఇతరులు-14 మంది ఓటర్లు, సర్వీస్ ఎలక్టొర్స్-45 మంది ఓటర్లున్నారు.

తాండూరు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు-1,90,360 మంది ఓటర్లుండగా వీరిలో పురుషులు-93,677 మంది ఓటర్లు, మహిళా ఓటర్లు-96,645 మంది ఓటర్లు, ఇతరులు-10 మంది ఓటర్లు, సర్వీస్ ఎలక్టొర్స్-28 మంది ఓటర్లున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు-1,89,078 మంది ఓటర్లుండగా,...పురుషులు- 94,157 మంది ఓటర్లు, మహిళా ఓటర్లు-94,802 మంది ఓటర్లు, ఇతరులు-18 మంది, సర్వీస్ ఎలక్టొర్స్-101 మంది ఓటర్లున్నట్లు ముసాయిదా జాబితా ప్రకారం ఎన్నికల అధికారులు తేల్చారు.

143
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...