కూటమికి ఓటమే..!


Fri,October 12, 2018 11:05 PM

-దిగజారుడు రాజకీయాలకు కూటమి పొత్తులే నిదర్శనం
-తటస్థులు పెద్దసంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరిక
-బషీరాబాద్ మండల పర్యటనలో మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి
బషీరాబాద్: ప్రజా సంక్షేమం కోసం పలు పథకాలను ప్రవేశపెట్టి అమలుపర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలో జీవన్గి, క్యాద్గీరా, గంగ్వార్, బషీరాబాద్, నవాంద్గి, ఇందర్‌చెడ్, మంతన్‌గౌడ్ గ్రామాల్లో పర్యటించి పార్టీ ముఖ్య నాయకులతో, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. జీవన్గి గ్రామంలో గ్రామస్థులతో కలిసి పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. గ్రామంలోని పలు వీధుల మీదుగా డప్పు చప్పుళ్ల నడుమ నృత్యాలు చేస్తూ భారీ ప్రదర్శనను నిర్వహించారు. గంగ్వార్ గ్రామంలో మంత్రి సమక్షంలో గ్రామ పెద్దలు పార్టీలో చేరారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభల్లో మంత్రి మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సంక్షేమ, అభివృద్ధి ప్రవేశపెట్టి అమలు చేశారని గుర్తుచేశారు. కూటమి పేరుతో టీడీపీతో కాంగ్రెస్ పార్టీ పొత్తుకు సిద్ధమవ్వడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శమన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. మోసపూరి హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. రైతుబంధు, బతుకమ్మ చీరల పంపిణీని అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన వ్యక్తం చేశారు. గ్రూప్ తగదాలతో కొట్టుకోవడానికే కాంగ్రెస్ పార్టీ నాయకులకు సమయం సరిపోవడం లేదని ఇక ప్రజాసేవ ఏమీ చేస్తారని మంత్రి ప్రశ్నించారు. కూటమి పేరుతో పార్టీలతో జతకట్టిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కష్టమన్నారు. ప్రజాసంక్షేమం పట్టని పార్టీలకు ప్రజలు తగిన బుద్ది చెబుతారని వెల్లడించారు.

గ్రామాల్లో తటస్థులు పలువురు చేరిక..
గ్రామాల్లో తటస్థంగా ఉన్న పలువురు గ్రామ పెద్దలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. గంగ్వార్ గ్రామానికి చెందిన ప్రతాప్‌రెడ్డి, నర్సిరెడ్డిలు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారిందరికి పార్టీ కండువా కప్పి మంత్రి స్వాగతం పలికారు. జీవన్గి, బషీరాబాద్ గ్రామాలకు చెందిన దాదాపు 50 మంది యువకులు పార్టీలో చేరారు. మంత్రి మాట్లాడుతూ టీఆర్ ఎస్ ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలకు ఆకర్షితులైన గ్రామాల్లోని తటస్థులు పార్టీలో చేరుతున్నారని వెల్లడించారు. పేదల సంక్షేమానికి కట్టుబడిన టీఆర్‌ఎస్ రానున్న శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు వెంకట్‌రాంరెడ్డి, పీఏసీఎస్ ఛైర్మన్ అల్విన్ అనంత్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అజయ్‌ప్రసాద్, మండల రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్ శంకర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ జీవన్గి మాణిక్‌రెడ్డి, నర్సిరెడ్డి, హరిసుదన్‌రెడ్డి, కయ్యం వెంకట్‌రెడ్డి, దస్తయ్యగౌడ్, టీఆర్‌ఎస్ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

122
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...