ఓటు హక్కు వినియోగించుకోవాలి


Fri,October 12, 2018 11:05 PM

-మహిళలు, దివ్యాంగులకు కలెక్టర్ సూచన
వికారాబాద్, నమస్తే తెలంగాణ : జరుగబోయే సాధారణ శాసనసభ ఎన్నికల్లో మహిళలు, దివ్యాంగులు అధిక సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ అన్నారు.

శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మహిళలు, దివ్యాంగులకు ఈవీఎం, వీవీప్యాట్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వారందరితో ప్రయోగాత్మకంగా ఓటు వేయించి చూపించారు. ఈ సందర్బంగా కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ మాట్లాడుతూ భర్తల ఇష్టానుసారంగా కాకుండా తమ తమ ఇష్టానుసారంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ది వ్యాంగులకు కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇంటి నుంచి పోలింగ్ బూత్ వరకు రవాణా సదుపాయం , అలాగే వీల్ చైర్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బాలింతలు, వయో వృద్దులు లైన్‌లో నిలబడకుండా నేరుగా వెళ్లి ఓటు హక్కును వినియోగించుకునేలా సదుపాయం కల్పించబడుతుందని తెలిపారు. అనంతరం మహిళలందరికీ ఓటు హక్కు వినియోగం ఈవీఎం, వీవీప్యాట్ల పనితీరుపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. దృష్టి లోపం ఉన్నవారు తమ భార్య, పిల్లలు లేదా ఎవరైన బంధువుతో కలిసి వచ్చి వారి ద్వారా ఓటు వేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళ శిశు సంక్షేమ వయోవృద్దుల శాఖ అధికారిణి జోత్స్న, మహిళ సంఘం అధ్యక్షురాలు ఇందిర, వికలాంగులు, వయోవృద్ధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

162
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...