కలెక్టరేట్‌లో బతుకమ్మ సంబురాలు


Fri,October 12, 2018 11:04 PM

వికారాబాద్, నమస్తే తెలంగాణ : స్వరాష్ట్రం సిద్ధించి తెలంగాణ ప్రభుత్వం వచ్చాక, బతుకమ్మ వేడుకలు అంబురాన్నంటేలా సంబురాలు నిర్వహించుకోవడం జరుగుతుందని కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. శుక్రవారం వికారాబాద్ కలెక్టరేట్‌లో వివిధ శాఖల మహిళ ఉద్యోగులతో కలెక్టరేట్ ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ వేడుకలను కలెక్టర్ పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాంప్రదా యం ప్రతిబింబించే విధంగా కార్యక్రమాలను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. వచ్చే ఏడాది బతుకమ్మ వేడుకలను కొత్త కలెక్టరేట్‌లో జరుపుకుంటామన్నారు. బతుకమ్మ పూల పండుగలా తెలంగాణ కూడా బంగారు తెలంగాణ విరజిల్లాలని ఆకాంక్షించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ అరుణ కుమారి మాట్లాడుతూ బతుకమ్మ పండుగను మహిళలు ఆనందోత్సవాలతో జరుపుకోవాలన్నారు. అలాగే జిల్లాలో జరుగబోతున్న ఎన్నికల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని ఎన్నికలు విజయవంతంగా జరిగేందుకు కృషి చేయాలన్నారు. కొత్త కలెక్టరేట్ కార్యాలంయలో బతుకమ్మ నిమజ్జనం కొరకు ప్రత్యేక కొలను ఏర్పాటు చేయించాలని కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో ఎస్పీ అన్నపూర్ణ, డీఆర్‌డీవో జాన్సన్, వ్యవసాయ శాఖ అధికారి గోపాల్, డీటీవో కోటాజీ, డీవైఎస్‌వో హన్మంతరావు, జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారి వాణి, డీఎస్పీ శరీష, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

142
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...