కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఆర్టీసీని


Thu,October 11, 2018 11:44 PM

-ప్రభుత్వంలో ఎందుకు విలీనం చేయలేదు
పరిగి, నమస్తే తెలంగాణ : తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించడం హాస్యాస్పదమని, కాంగ్రె స్ అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో ఎందు కు విలీనం చేయలేదని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వథ్ధామరెడ్డి ప్రశ్నించారు. ఉమ్మ డి ఆంధ్రప్రదేశ్‌లో అనేక ఏండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉం దని, ఆ రోజుల్లో ఆర్టీసీ పరిరక్షణ ఎందుకు గుర్తుకు రాలేద న్నారు. గురువారం పరిగిలోని టీచర్స్ కాలనీలో గల ఎస్వీ గార్డెన్‌లో జరిగిన తెలంగాణ మజ్దూర్ యూనియన్ రీజినల్ సమావేశంలో పాల్గొన్న అశ్వథ్ధామరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ ఓ యూనియన్ నాయకుడు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వినతి పత్రం అందించగానే తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించడం గమనార్హమన్నారు.

అనేక ఏండ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆర్టీసీ ఎందుకు గుర్తుకు రాలేదని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయాలంటే అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల మెజార్టీతో ఆమోదం పొందాల్సి ఉంటుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నాటి కాంగ్రెస్, నేటి బీజేపీ అనేక ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేశాయని ఆయన గుర్తు చేశారు. అలాంటిది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామనడం ఎంత వరకు నమ్మవచ్చని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమంతో పాటు వారి హక్కులను సాధించుకున్న ఏకైక యూనియన్ టీఎంయూ అని తెలిపారు. 16 శాతం ఐఆర్ సాధించిన ఘతన టీఎంయూదని, ఆర్టీసీ పరిరక్షణకు ప్రభుత్వం ఓ ఉన్నత స్థాయి కమిటీని నియమించిందని, ఈ కమిటీలో నిష్ణాతులైన నిపుణులు ఉన్నారని, త్వరలోనే వారు ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారన్నారు. టీఎంయూలోనే ప్రత్యేకంగా ఓ కమిటీ వేసి డ్రైవర్లు, కండక్టర్ల ఉద్యోగ భద్రతకు సంబంధించి అనేక అంశాలపై చర్చించి నివేదికను రూపొందించడం జరిగిందని, ఈ నివేదికను సంస్థ యాజమాన్యానికి, ప్రభుత్వానికి త్వరలోనే సమర్పిస్తామని అశ్వథ్ధామరెడ్డి తెలిపారు.

రాబోయే ఆర్టీసీ యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో రాష్ట్ర ంలో 97 డిపోలు ఉండగా 90 పైచిలుకు డిపోల్లో టీఎం యూ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశా రు. కొందరు నాయకులు వాళ్ల పబ్బం గడుపుకోవడానికి కులాల పేరిట సంఘాలు ఏర్పాటు చేయడం మంచిది కాదన్నారు. ఆర్టీసీని బతికించడంతో పాటు తాము బతకాలనే ఉద్దేశంతో పని చేసినప్పుడే సంస్థ పదికాలాల పాటు నిలుస్తుందన్నారు. వివిధ కారణాల వల్ల చనిపోయిన వారి పిల్ల లు 62 మందికి సెక్యూరిటీ గార్డులుగా ఉద్యోగాలు ఇప్పించిన ఘనత తమ సంఘానిదని చెప్పారు. వివిధ రకాల చెల్లి ంపుల కోసం సంస్థకు తక్షణమే రూ.300కోట్లు ఇప్పించాలని మంత్రి హరీశ్‌రావును కలిసి కోరినట్లు ఆయన తెలిపా రు. త్వరలోనే టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ కేశవరావును కలిసి ఆర్టీసీ పరిపరక్షణకు సంబంధించిన అంశాలను చేర్చాలని కోరనున్నట్లు పేర్కొన్నారు.

టీఎంయూ వర్కింగ్ ప్రెసిడెంట్ థామస్‌రెడ్డి మాట్లాడుతూ కార్మికుల ఆత్మగౌరవాన్ని పెంచి, వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడింది టీఎంయూ అని అన్నారు. గతంలో ఎవరైనా కార్మికుడు చనిపోతే పిల్లలకు ఉద్యోగం వద్దంటే లక్ష రూపాయలు ఇచ్చేవారని, దాన్ని రూ.5లక్షలకు పెంచేలా చూసిన ఘనత తమ సంఘానిదన్నారు. కార్మికులకు సంబంధించి అనేక హక్కులు సాధించి పెట్టామని, కొన్ని సంఘాలు తమ మనుగడ కోసం మాట్లాడుతున్నాయి తప్ప కార్మికుల సంక్షే మం వారికి పట్టదన్నారు. ఇతర యూనియన్లకు ఓటు వేస్తే మురికి కాలువలో వేసినట్లేనన్నారు. ఈ సందర్భంగా పలువురు ఇతర యూనియన్ల నాయకులు టీఎంయూలో చేరా రు. కార్యక్రమంలో టీఎంయూ రాష్ట్ర చీఫ్ వైస్ ప్రెసిడెంట్ మారయ్య, కార్యదర్శి వీఎస్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి ఉషాకిరణ్, కార్యదర్శులు మాలతి, హుస్సేన్, జోనల్ అధ్యక్షుడు మల్లారెడ్డి, రీజినల్ సెక్రటరీ ఎల్‌బీ రెడ్డి, నాయకులు బాలయ్య, ఎస్‌ఎ రాజు, బివి జయకుమార్, స్థానిక టీఎం యూ నాయకులు కె.నిరంజన్, ఎస్‌జెఎం రెడ్డి, మల్లయ్య, అనంతయ్య, సిద్దిఖి, వీఎన్ గౌడ్, జీపీ రెడ్డి, వెంకటయ్య, జంగయ్య, జహంగీర్, కార్మికులు పాల్గొన్నారు.

128
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...