రెండేండ్లలో అభివృద్ధి పరుగు


Thu,October 11, 2018 12:16 AM

తాండూరు, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి నేటితో రెండేండ్లు పూర్తవుతున్నది. కొత్త జిల్లాల్లో ఏర్పాటైన వాటిలో వికారాబాద్ జిల్లా కూడా ఒకటి. పశ్చిమ రంగారెడ్డి జిల్లాగా వ్యవహరించే కొత్త జిల్లాల్లోని అధిక భాగం కొత్త జిల్లా ఆవిర్భావంతో ఈ ప్రాంత ప్రజలకు పరిపాలన చేరువైంది. అంతకు ముందు ఉన్న ఉమ్మడి జిల్లాలో జిల్లా వాసులు దాదాపు 130 కిలో మీటర్ల దూరం వెల్లవాల్సి వచ్చేది. హైదరాబాద్ లక్డీకాఫూల్‌లోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చేందు కు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడేవారు. జిల్లా స్థాయి సమావేశాలకు అధికారులు కూడా కలెక్టరేట్ కార్యాలయానికి రావ డానికి ఇబ్బందులు పడేవారు. దీంతో కింది స్థాయి అధికారులు కూడా తమ శాఖల ఫైళ్లు పట్టుకుని హైదరాబాద్‌లో ఉన్న జిల్లా స్థాయి అధికారుల వద్దకు పరగులు పెట్టే వారు. పేరుకే ప్రత్యేక జిల్లా అయినప్పటికీ హైదరాబాద్‌లో నిత్యం జరిగే ధర్నాలు, ఆందోళనలతో జిల్లా ప్రజలు తమ పనులు చేసుకునేందుకు రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటుతో వికారాబాద్ వంటి మారుమూల మండలాలు ఉన్న ప్రాంత వాసులకు ఎంతో మేలు కలిగింది. గంటలోగా చేరితే జిల్లా కలెక్టర్ వద్దకు నేరుగా చేరుకునే అవకాశం కొత్త జిల్లాల ఏర్పాటుతో కలుగడంతో ప్రజలు కూడా తమ పనులు వెను వెంటనే చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. సకాలంలో పనులు కూడా పూర్తవుతుండడంతో ప్రజలు సంతోషం గా ఉన్నారు. పైగా వికారాబాద్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలన్న ఆకాంక్ష ఈ ప్రాంతం ప్రజలకు దాదాపు మూడు దశాబ్దాలుగా ఉండేది. అయితే కొత్త రాష్ట్రం వచ్చాక కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రాంత ప్రజల చిరకాల వాంచ నెరవేరింది.

వేగంగా జిల్లా కలెక్టరేట్ భవనం పనులు...
కొత్త జిల్లాల ఏర్పాటుతో తెలంగాణ ప్రాంతానికి నవశకం వచ్చినట్లయింది. జిల్లాలు, మండలాలు కొత్త రూపును సంతరించుకున్నాయి. సీఎం కేసీఆర్ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలకు పరిపాలనను మరింత చేరువలో చేయాలన్న ఉద్దేశ ంతో కొత్త జిల్లాల ఏర్పాటు చేయడంతో ప్రజలకు ఉన్నాతాధికార యంత్రాంగం మరింత చేరువవుతున్నది. సంక్షేమ పథకా లు అర్హులైన వారికి చేరేలా అమలు, పర్యవేక్షణకు ఆస్కారం కలిగింది. కాగా కొత్తగా ఏర్పడిన జిల్లాలకు కొత్త కలెక్టరేట్ భవనాలను (సమీకృత కలెక్టరేట్ కార్యాలయం భవనం) కూడా వేగ ంగా ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కొత్త భవనం పనులు వేగంగా చేపట్టడంతో మరో మూడు నెలల్లో ప్రారంభానికి సిద్ధం కానుంది. రూ.60 కోట్ల నిధులతో చేపట్టిన భవనంలో దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారం యంత్రాంగం విధులు నిర్వహించుకునేలా వసతులు కల్పించి నిర్మాణం చేపట్టారు. గతంలో ఉమ్మడి జిల్లాలో ఈ ప్రాంతం కొనసాగిన సమయంలో ముఖ్యంగా పశ్చిమ రంగారెడ్డి జిల్లా పరిధిలోని వికారాబాద్ ప్రాంతం వారు జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలను వెతుక్కునే పరిస్థితులు ఉండేవి. హైదరాబాద్‌లో దిల్‌షుఖ్‌నగర్, గచ్చిబౌలి, ఎల్‌బీనగర్ తదితర ప్రాంతాల్లో జిల్లా కార్యాలయాలు ఉండేవి. అయితే కొత్త కలెక్టరేట్ భవనం నిర్మాణం పూర్తయితే ఒకే చోట దాదాపు 40 వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికార యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండనుంది.

అన్ని ప్రభుత్వ శాఖలు ఒకే చోట...
జిల్లాలు ఏర్పడిన తర్వాత వికారాబాద్ జిల్లా విషయానికి వస్తే 90 శాతం కార్యాలయాలు వికారాబాద్ ప్రాంతంలో వివిధ చోట్ల అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. అయితే కలెక్టరేట్‌తో పాటు అన్ని ప్రభుత్వ శాఖల అధికార యంత్రాంగం ఒకే చోట ఉండాలన్న సీఎం కేసీఆర్ ఆకాంక్షతో జిల్లాకు సమీకృత జిల్లా కలెక్టరేట్ భవనానికి వెను వెంటనే నిధులు మంజూరైనాయి. జిల్లా మంత్రి, రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి చొరవతో వికారాబాద్‌కు చేరువలోనే దాదాపు 10 ఎకరాల స్థలంలో కొత్త కలెక్టరేట్ భవన నిర్మాణం జరుగుతున్నది. దీంతో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలు వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లోని 18 మండలాల ప్రజలకు జిల్లా కలెక్టరేట్ భవనం అందుబాటులో ఉండనుంది. జిల్లాలోని దా దాపు అన్ని మండలాలకు సమాన దూరంలో కలెక్టరేట్ కార్యాలయ భవనం ఉండేలా నిర్మాణ స్థలాన్ని గుర్తించి నిర్మాణం చేపట్టడంతో జిల్లా ప్రజలకు రవాణా మార్గాలు కూడా అందుబాటులో ఉండనున్నాయి. దీంతో కాలం వృథా చేయకుండా ఒకే రోజు వివిధ శాఖల పనులు చేసుకునే వెసులు బాటు ప్రజలకు అందుబాటులోకి రానుంది.

అందుబాటులోకి పరిపాలన...
జిల్లా కలెక్టరేట్ అందుబాటులో ఏర్పాడడంతో కలెక్టర్ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. జల్లాలోని ఏ మండలంలో సమస్యలున్నా, పర్యటనలు చేయాలన్న కేవలం ఒక గంట వ్యవధిలోనే కలెక్టర్ యంత్రాంగంతో చేరుకుని ప్రజల సమస్యలు, అభివృద్ధి పనుల అమలు తీరును సమీక్షించే అవకాశం కలిగింది. జిల్లాలో రెవెన్యూ డివిజన్ల స్థాయిలో పాటు నియోజకవర్గాల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఈ ప్రజావాణి కార్యక్రమాలు చేపడుతుండడంతో తమకున్న సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. తద్వారా త్వరితగతిన ప్రజల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించేందుకు ఆస్కారం కలుగుతున్నది. ప్రతి ప్రజావాణి కార్యక్రమంలో 50కి పైగా ఫిర్యాదు లు వస్తుండడం గమనార్హం. రైతులు తమకున్న భూముల సమస్యలు, వివాదాలు ఎక్కువగా పరిష్కరించుకుంటున్నారు. ప్రజావాణి కార్యక్రమం నుంచి కలెక్టర్ శాఖల వారీగా సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు జిల్లా స్థాయి అధికార యంత్రాంగాన్ని బాధ్యులను చేరవేయగలుగుతున్నారు. ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదులను 15 రోజుల్లోగా పరిష్కారం లభిస్తున్నది.

సమీక్షలతో అధికారుల పనితీరు బాగు...
సమీక్షలతో అధికారుల పనితీరును కలెక్టర్ తరచుగా సమీక్షించేందుకు ఆస్కారం కలుగుతున్నది. తాండూరు తహసీల్దార్ కార్యాలయంలో కొత్త ఓటర్లను ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియ ఆలస్యంగా జరుగుతున్న విషయాన్ని గమనించి కలెక్టర్ సయ్య ద్ ఉమర్ జలీల్ రాత్రి 8 గంటల సమయంలో తాండూరుకు చేరుకుని కారణాలను ఆరా తీయడం గమనార్హం. సమస్యలు అధికారులతో తెలుసుకున్న కలెక్టర్ పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకున్నారు. ఇలా సమస్యలు ఏర్పడిన సందర్భంలో కలెక్టర్ ప్రజలకే కాకుండా జిల్లాలోని అన్ని ప్రాంతాల అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేసే అవకాశం కలిగింది.

ప్రభుత్వ పథకాలు సజావుగా అమలుకు...
కొత్త జిల్లా ఏర్పడి ప్రభుత్వ అధికార యంత్రాంగం అందుబాటులోకి రావడంతో ప్రభుత్వ కార్యక్రమాలు, ముఖ్యంగా అభివృద్ధి పనులు వేగంగా అమలయ్యేందుకు వీలు కలుగుతున్నది. హరితహారం, స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంతో ఇంటింటికీ మరుగుదొడ్ల నిర్మాణం పనులు వేగంగా అమలు చేసేందుకు వీలు కలిగింది. ఇంతే కాకుండా జిల్లాలోని తాండూరు మండలంలో రూ.100 కోట్ల వ్యయంతో చేపడుతున్న రూర్బన్ కార్యక్రమం సజావుగా అమలయ్యేందుకు కలెక్టర్ స్వయంగా తనిఖీలు నిర్వహించి వేగంగా అభివృద్ధి పనులు అమలయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి అభివృద్ధి పనులు కలెక్టర్ స్వయంగా పరిశీలించేందుకు వెసులుబాటు కలుగుతున్నది.

జిల్లా సమాచారం...
కొత్తగా రాష్ట్రంలో ఏర్పాటైన 31 జిల్లాల్లో వికారాబాద్ జిల్లా కూడా ఒకటి. 2016 అక్టోబర్ 11న జిల్లాను ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లాలో పశ్చిమ భాగాన ఉన్న 15 మండలాలు, మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని మూడు మండలాలతో కొత్త జిల్లాను ఏర్పాటు చేశారు. ఈ జిల్లాలో తాండూరు, వికారాబాద్ రెండు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటైనాయి. జిల్లాలో మొత్తం 18 మండలాలు, రెండు రెవెన్యూ డివిజన్లు, 503 రెవెన్యూ గ్రామా లు, 3386 చదరపు కిలో మీటర్ల వైశా ల్యం కలిగి ఉంది. జల్లాలో 8 లక్షల 91 వేల మంది జనాభా అధికారిక లెక్క ల ప్రకారం ఉండగా అనధికారికంగా 9.5 లక్షల జనాభా నివసిస్తున్నది.

సాగు నీటి ప్రాజెక్టు మంజూరు...
ధారూరు మండలం నాగారం ప్రాజెక్టు కు 258 ఎకరాల స్థలాన్ని సేకరించారు. 1800 ఎకరాల ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో ఈ కొత్త ప్రాజెక్టుకు కాల్వలకు, శిఖం(సర్‌ఫ్లస్) భూముల నిమిత్తం 258 ఎకరాలు అవసరమని గుర్తించారు. సర్వే, స్థల సేకరణ నిమిత్తం రూ.17కోట్ల 60 లక్షల నిధులను కేటాయించారు. రెవెన్యూ, నీటి పారుదల శాఖ జాయింట్ సర్వే పూర్తయింది. ప్రాజెక్టు సివి ల్ పనులకు రూ.32 కోట్ల నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. యాలాల మండలం శివసాగర్ ప్రాజెక్టుకు రివైజ్డ్ ఎస్టిమెంట్లు వేస్తున్నట్లు, రూ.12 కోట్ల వరకు నిధులు ప్రభుత్వం మంజూరు చేసింది.

733 చెరువులకు రూ. 248. 95 కోట్ల నిధులు...
జిల్లా పరిధిలో మొత్తం 1207 చెరువులు, కుంటలు ఉండగా 77538 ఎకరాల ఆయకట్టు ఉంది. అందులో నాలుగు విడు తల్లో 733 చెరువులకు రూ.248.95 కోట్ల నిధులు మంజూరు చేసింది. మొదటి విడుతలో 241 చెరువులకు రూ.83 కోట్ల 34 లక్షలు, రెండో విడుతలో 265 చెరువులకు రూ.118 కోట్ల 33 లక్షలు, మూడో విడుతలో 129 చెరువులకు రూ.29 కోట్ల 52 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. నాలుగో విడుతలో 98 చెరువులకు రూ.17 కోట్ల 76 లక్షల నిధులను మంజూరు చేయగా 3571 ఎకరాల ఆయకట్టు పునరుద్ధరణకు నోచుకోనుంది. నాలుగో విడుతల్లో కలిపి 66 వేల 856 ఎకరాల ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగు నీరందించే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి.

జిల్లాకు సమకూరుతున్న మైనింగ్ మినరల్ సెస్...
సహజవనరులైన నాపరాళ్లు, సుద్ద, ఇసుక, ల్యాటరైట్ వంటి వనరులకు తోడు తాండూరు ప్రాంతంలో నాలుగు సిమెంట్ కర్మాగారాలు ఉండడంతో ఏటా కనీసం రూ.వెయి కోట్లకు పైగా విలువైన ఉత్పత్తులు జరుగుతున్నా యి. అందులో రూ.100 కోట్ల వరకు రాయల్టీ, సీనరేజీ, వ్యాట్ పన్నుల రూపంలో ఇన్‌కంటాక్స్ రూపంలో కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయంగా సమకూరుతున్నది. తాండూరు ప్రాం తంలోని నాలుగు సిమెంట్ కర్మాగారాల వల్లే ఏటా కనీసం రూ.50 కోట్లు సమకూరుతుండగా, నాపరాళ్లు, సుద్ధ ఎగుమతులు, రవాణాల వల్ల కూడా మరో రూ.50 కోట్ల ఆదాయం సమకూరుతున్నది. జిల్లాకు ఈ వనరుల వల్ల ఏటా కనీసం రూ.30 కోట్ల మైని ంగ్ మినరల్ సెస్ సమకూరుతున్నది. ఈ నిధులను కలెక్టర్ జిల్లా మంత్రి ఆధ్వర్యంలోని కమిటీ సూచనలతో మారుమూల గ్రామాల్లో అభివృద్ధి పనులు మంజూరు చేయగలుగుతున్నారు.

తాండూరు నియోజకవర్గంలో రోడ్ల మరమ్మతులకు, జిల్లా దవాఖానలో వసతులకు వెచ్చించడం గమనార్హం.
జిల్లాకు ఆదాయం..
ప్రభుత్వం సాగు రంగానికి 24 గం టల ఉచిత కరెంట్ అందిస్తుండడంతో పంట ఉత్పత్తుల దిగుబడులు గణనీయంగా పెరిగాయి. దీంతో జిల్లాలోని తాండూరు, వికారాబాద్ వ్యవసాయ మార్కెట్లు మంచి ఆదాయం పొందుతున్నాయి. తాండూరు వ్యవసాయ మార్కెట్‌లో ఏటా రూ.300 కోట్ల విలువైన వివిధ రకాల పంట ఉత్పత్తులు, వికారాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో దాదాపు రూ.150 కోట్ల విలువైన పంట ఉత్పత్తులు విక్రయమవుతున్నాయి. ఈ క్రయ విక్రయాల వల్ల కూడా ఏటా వ్యాట్( జీఎస్టీ స్టేట్, సెంట్రల్) రూపంలో , అలాగే రవాణా పన్నుల రూపంలో జిల్లాకు కనీసం రూ.25 కోట్లకు పైగానే ఆదాయం సమకూరుతున్నది. కాగా జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లాలోని 1.80 లక్షల మంది రైతులకు కొత్త నమూనాలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ జరిగింది. సమగ్ర భూ ప్రక్షాలన ద్వారా రైతులకు తమ భూములపై యాజమాన్య హక్కులు కల్పించి కొత్త పాసుపుస్తకాలు పంపిణీ చేశారు.

రోడ్ల మరమ్మతులకు రూ.650 కోట్లు...
జిల్లాలో ఆర్‌అండ్‌బీ రోడ్ల మరమ్మతులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లా కేంద్రం నుంఛఇ అన్ని మండలాలకు ప్రధాన రోడ్లను బాగు చేస్తున్నారు. జిల్లాలోని ఆర్‌అండ్‌బీ రోడ్ల మరమ్మతులకు రూ.650 కోట్ల నిధులను గత రెండేండ్లలోనే కేటాయించడం గమనార్హం. కాగా తాండూరు పట్టణంలో బైపాస్ రోడ్డు కోసం రూ.78 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లాకు ఓ బైపాస్ రోడ్డు ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిధులను మంజూరు చేయడం గమనార్హం.

144
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...