రక్షణ చట్టం చేయాలని వినతి


Tue,September 25, 2018 11:49 PM

తాండూరు రూరల్/యాలాల/బొంరాస్‌పేట : కులాంతర వివాహం చేసుకున్న వారికి కులాంతర వివాహ రక్షణ చట్టం చేయాలంటూ బీఎల్‌ఎఫ్ నాయకులు మంగళవారం తాండూరు నాయబ్ తహసీల్దార్ సౌకత్ అలీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఎల్‌ఎఫ్ కన్వీనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ కులాంతర విహాలు చేసుకున్న వారిపై దాడి చేసి హత్యలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ఆర్థిక సహాయం చేయడంతోపాటు వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కులాంతర వివాహం చేసుకున్న వారిపై దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. కుల దురహంకార హత్యలను ప్రభుత్వం వెంటనే ఆపాలని కోరుతూ టీమాస్ నాయకులు మంగళవారం బొంరాస్‌సేట తహసీల్దార్ కార్యాలయంలో ఏఆర్‌ఐ అనితకు వినతిపత్రం అందజేశారు. కులాంతర వివాహాలకు రక్షణ కల్పించాలని కోరుతూ దళిత, ప్రజా సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. మంగళవారం యాలాల తహసీల్దార్ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంటు మహేశ్‌కు వినతి పత్రం ఇచ్చారు.
తాండూరులో దస్తప్ప, అంజిలప్ప, జయపాల్,రాజు, బొంరాస్‌సేటలో సీపీఎం జిల్లా నాయకుడు బుస్స చంద్రయ్య, టీమాస్ జిల్లా నాయకుడు కే. చంద్రయ్య, మండల ఛైర్మన్ వెంకటయ్య, బీఎల్‌ఎఫ్ నాయకుడు బాల్‌రాం, బీఎస్‌పీ నాయకులు వెంకట్రాములు, శకునప్ప, ఎంఆర్‌పీఎస్ నాయకుడు నాగప్ప, కరుణాకర్, బాలు, యాలాలలో కేవీపీఎస్ నాయకులు మల్కయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బుగ్గప్ప, ఎంఆర్‌పీఎస్ జిల్లా మాజీ అధ్యక్షులు ఆశన్న, నాయకులు యాదప్ప, రమేశ్, వేణుగోపాల్, నర్సింహులు పాల్గొన్నారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...