ఓటరు నమోదుకు అపూర్వ స్పందన


Tue,September 25, 2018 11:49 PM

కొడంగల్, నమస్తే తెలంగాణ : ఓటరు నమోదు ప్రక్రియపై వారం రోజులుగా అవగాహన కల్పిస్తున్నామని తహసీల్దార్ వెంకటేశ్ పేర్కొన్నారు. మంగళవారం ఓటరు నమోదు చివరి రోజు కావడంతో నియోజకవర్గ పరిధిలోని కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్, కోస్గి, మద్దూర్ మండ లాలకు సంబంధించి మొత్తంగా 1605 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. ఫాం6 కొత్తగా ఓటరు నమో దుకు గాను 1470దరఖాస్తులు అందగా చనిపో యిన, వలసవెళ్లిన, సరిచేయడాలకు సంబంధించి 65(ఫాం 7), 27 (ఫాం8), 43(ఫాం 8ఎ) దరఖాస్తులు అందినట్లు తెలిపారు. వచ్చిన ధరఖా స్తులను పరిశీలించడం జరుగుతుందని, అక్టోబర్ 8వ తేదీన తుది ఓటరు జాబితాను విడుదల చేసే ప్రణాళిక ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం నియోజకవ ర్గంలో మొత్తం ఓటర్లు 1,88977 మంది ఉన్నారని వీరిలో 94,802 మహిళలు, 94,157మంది పురుష ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. కాగా 25 వరకు ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగుతుండటం వల్ల ఓటర్లు పెరిగే అవకాశం ఉందన్నారు. గత సంవత్సరం కం టే ఈ సారి చని పోయి, వలస వెళ్లిన వారి ఓట్ల తొలగింపుతో ఓటరు సంఖ్య తగ్గిందని తెలిపా రు. గత వారం రోజులుగా నిర్వహించిన ఓటరు నమోదు ప్రక్రియలో మొత్తంగా వచ్చిన దరఖాస్తుల వివరాలు అందాల్సి ఉందని, దాన్ని బట్టి ఓటర్లు ఎంత మంది పెరుగుతారనేది స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

105
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...