జిల్లా షెడ్యూల్డ్ కులాల రుణ ప్రణాళిక రూ.67.74 కోట్లు


Tue,September 25, 2018 11:46 PM

వికారాబాద్, నమస్తే తెలంగాణ :జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ వార్షిక రుణ ప్రణాళిక 2018 -19కి గాను రూ.67.74కోట్లు ప్రభుత్వం కేటాయించడం జరిగిందని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోజస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అందులో బ్యాంకు లింకేజ్ కింద 413 యూనిట్లుగా కేటాయించారన్నారు. కేటగిరీ 1 కింద లక్షకు 80 శాతం సబ్సిడీని ప్రభుత్వం అందించగా, మిగతా 20 శాతం బ్యాంకు రుణం, లబ్ధిదారుడి వాటాగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. కేటగిరీ 2లో రూ.2లక్షల సబ్సిడీ రుణంలో 70 శాతం రుణం ప్రభుత్వం బ్యాంకులకు అందించనుందని తెలిపారు. కేటగిరీ 3 కింద రూ.2లక్షల నుంచి 12 లక్షల వరకు 60 శాతం సబ్సిడీని ప్రభుత్వం అందించనుండగా, మిగతా 40 శాతం బ్యాంకులు యూనిట్ల ఉపాధి కల్పనకు రుణం అందించనుందన్నారు. భూమి కొనుగోలు పథకమునకు రూ.15.12కోట్లతో 72 మంది అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి బ్యాంకు లింకేజితో సంబంధం లేకుండా నేరుగా ఎస్సీ కార్పొరేషన్ భూమి కొనుగోలు చేయుటకు ప్రభుత్వం కేటాయించిందన్నారు. జిల్లాలో ఎకరానికి రూ.2 నుంచి 7 లక్షల చొప్పున 116 ఎకరాలు కొనుగోలు చేయడానికి వార్షిక ప్రణాళికలో నిధులు కేటాయించడం జరిగిందన్నారు. జిల్లాలో యువతకు నైపుణ్యాభివృద్ధి కోసం రూ.5.97లక్షలు కేటాయించినట్లు తెలిపారు.

ఈ నిధులతో నైపుణ్యం పెంపొందించేందుకు 273 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అందులో వ్యవసాయ రంగంలో 320 మంది రైతులకు శిక్షణ కోసం రూ.32.80లక్షలు కేటాయించినట్లు తెలిపారు. జిల్లాలో చిరు వ్యాపారం నిర్వహించుకొనే 498 మందికి బ్యాంకు లింకేజ్ లేకుండా నేరుగా రూ.50వేలు అందించి నెలకొల్పిన రూ.50వేల యూనిట్ల మనుగడపై ప్రత్యేక్ష పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. ఎస్సీ కులానికి చెందిన అభ్యర్థులు ఆధార్ కార్డు కలిగి ఉండి, 21 నుంచి 50 ఏండ్ల మధ్య వయస్సు ఉండాలన్నారు. వ్యవసాయాదారిత పథకానికి 21 నుంచి 60 ఏండ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలన్నారు. వీరికి వార్షిక ఆధాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్ష లోపు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2లక్షలకు మించకూడదన్నారు. లబ్ధిదారు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ సంస్థ నుంచి లబ్ధి పొంది ఉండవద్దని తెలిపారు. లబ్ధిరుల ఎంపిక ఎస్సీ కార్పొరేషన్ నుంచి కాని ఇతర శిక్షణ అనుభవం గల సంస్థ నుంచి శిక్షణ పొందిన వారికి 21 పథకాల్లో వెంటనే ప్రాధాన్యత ఇచ్చి నేరుగా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ఎస్సీ కులాల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రుణాలు పొందడానికి అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల చేసుకోవాలని తెలిపారు. http : tsobmms.cgg.gov.i-వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రణాళిక ప్రకారం జిల్లాలోని ఎస్సీ అర్హులైన అభ్యర్థులకు రుణాలు అందించేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పూర్తి వివరాలు జిల్లా కలెక్టరేట్‌లోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో కాని ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్‌లను సంప్రదించాలని ఆయన సూచించారు.

130
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...