భూమిచ్చి అండగా నిలిచిన కేసీఆర్ సార్‌కే మద్దతు


Sun,September 23, 2018 11:20 PM

-జిల్లాలోని దళితుల కుటుంబాల్లో వెలుగులు
-భూ పంపిణీతో బాగుపడిన లబ్ధిదారుల కుటుంబాలు
-నాలుగేండ్లలో 211 ఎకరాలు పంపిణీ చేసిన సర్కార్
-ఇప్పటివరకు రూ.10 కోట్లను వెచ్చించిన ప్రభుత్వం
-మరోసారి టీఆర్‌ఎస్‌ని గెలిపించుకుంటామంటున్న దళిత కుటుంబాలు
-భూమి ఇచ్చి అండగా నిలిచిన సీఎం కేసీఆర్ సార్‌కే మద్దతు అంటున్న లబ్ధిదారులు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్ ప్రభుత్వం దళితుల అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. నిరుపేద దళితులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకుగాను ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న ప్రభుత్వం,...వారు త్వరితగతిన ఎదిగేందుకుగాను కొన్ని పథకాల్లో పూర్తి సబ్సిడీని కల్పిస్తూ పేద దళితులకు బ్రతుకుపై భరోసాను కల్పిస్తున్నది. అంతేకాకుండా ముఖ్యంగా ప్రభుత్వం భూమిలేని నిరుపేద దళితుల కోసం అమలు చేస్తున్న భూపంపిణీ పథకంతో జిల్లాలోని చాలా మంది నిరుపేద దళితుల జీవితాల్లో వెలుగులు నిం డాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూ పంపిణీ పథకంతో గతంలో కూలీలుగా బ్రతుకునీడుస్తున్న నిరుపేద దళిత కుటుంబాలను నేడు భూ యజమానులను చేసింది. 2014 ఆగస్టు 15న ప్రారంభించిన భూ పంపిణీ పథకంతో తొలి విడుతలో చేసిన భూ పంపిణీతో సంబంధిత లబ్ధిదారులు గత మూడేం డ్లుగా ఆయా పంటలను సాగు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ఒకప్పుడు కూలీతో జీవితం సాగిస్తున్న పేద దళితులకు ఒక్కొక్కరికి మూడెకరాల చొప్పున సాగుకు యోగ్యమైన భూములను పంపిణీ చేయడంతో నిరుపేద దళితుల కుటుంబాల్లో కొత్త వెలుగులు రావడంతో కేసీఆర్ సార్‌కు జై కొడుతున్నారు. అయితే జిల్లావ్యాప్తంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వ నాలుగేండ్ల పాలనలో భూ పంపిణీ పథకం కింద 84 మంది దళితులకు 211 ఎకరాలను పంపిణీ చేశారు. సంబంధిత భూములను కొనుగోలు చేసేందుకుగాను రూ.10 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది.

జిల్లాలో దళితులకు భూపంపిణీలో భాగంగా నాలుగేండ్లలో 118 మంది లబ్ధిదారులకు 221 ఎకరాల 23 గుంటల భూమి ని పంపిణీ చేశారు. తొలి విడత 2014-15 సంవత్సరంలో 16 మందికి మూడెకరాల చొప్పున 48 ఎకరాల 39 గుంటలను పంపిణీ చేశారు. తొలి విడుత పంపిణీ చేసిన 48 ఎకరాల 39 గుంటలను జిల్లా యంత్రాంగం రూ.1.15 కోట్లు వెచ్చించి సాగుకు యోగ్యంగా ఉండే భూములను కొనుగోలు చేసింది. దోమ మండలంలో ముగ్గురు లబ్ధిదారులకు 19 ఎకరాలను, మర్పల్లిలో ఇద్దరు లబ్ధిదారులకు 6 ఎకరాలను, నవాబుపేట్‌లో ఐదుగురికి 15 ఎకరాలను, యాలాల మండలంలో ఆరుగురు లబ్ధిదారులకు 18 ఎకరాలను జిల్లా యంత్రాంగం పంపిణీ చేసింది. అదేవిధంగా రెండో విడుత భూ పంపిణీలో భాగంగా 30 మంది లబ్ధిదారులకు 85 ఎకరాల 15 గుంటల భూమిని పంపిణీ చేశారు. సంబంధిత భూముల కొనుగోలు నిమిత్తం రూ.3.19 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది.

2015-16 ఆర్థిక సంవత్సరంలో బషీరాబాద్ మండలంలో 11 మంది లబ్ధిదారులకు 30 ఎకరాల 27 గుంటలు(రూ.1.25 కోట్లు), ధారూర్ మండలంలో ఆరుగురు లబ్ధిదారులకు 17.39 ఎకరాలు (రూ.65.61 లక్షలు), నవాబుపేట్ మండలంలో నలుగురు లబ్ధిదారులకు 12 ఎకరాలను(రూ.42.35 లక్షలు), యాలాల మండలంలో ఏడుగురు లబ్ధిదారులకు 18 ఎకరాల 29 గుం టల భూమిని(రూ.58.83 లక్షలు) భూమిలేని నిరుపేద దళితులకు ఒక్కొక్కరికి మూడెకరాల చొప్పున పంపిణీ చేశారు. 2016-17 సంవత్సరంలో యాలాల మండలంలో 12 మంది లబ్ధిదారులకు 18 ఎకరాల 16 గుంటలు(రూ.57.04 లక్షలు), బషీరాబాద్ మండలంలో ఆరుగురు లబ్ధిదారులకు రూ.15 ఎకరాల 27 గుంటలు(రూ.60.11 లక్షలు), తాండూరు మండలంలో ఏడుగురు లబ్ధిదారులకు 16 ఎకరాల 37 గుంటలు(రూ.87.78 లక్షలు), బొంరాస్‌పేట్ మండలంలో 13 మంది లబ్ధిదారులకుగాను 28 ఎకరాలను 5 గుంటల భూమిని రూ.87.71 లక్షలతో కొనుగోలు చేసి లబ్ధిదారులకు సంబంధిత అధికారులు పంపిణీ చేశారు.

నాలుగో విడత భూ పంపిణీలో భాగంగా 26 మంది లబ్ధిదారులకు 60 ఎకరాల 33 గుంటల భూమిని పంపిణీ చేశారు. అదేవిధంగా ఈ 2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను భూ పంపిణీకి ప్రభుత్వం నిధులను ఇప్పటికే మంజూరు చేయగా...ఈ ఆర్థిక సంవత్సరం 67 మంది దళిత మహిళలకు 201 ఎకరాల సాగుకు యోగ్యమైన భూములను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు టార్గెట్‌ను నిర్ణయించింది. అయితే ఈ ఏడాది భూ పంపిణీ నిమిత్తం ఇప్పటివరకు 76 ఎకరాలను కొనుగోలు చేసిన సంబంధిత అధికారులు త్వరలో పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే కొనుగోలు చేసిన భూములకు సంబంధించి 55 ఎకరాలకు రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యింది. జిల్లా యంత్రాంగం కొనుగోలు చేసిన భూముల్లో తాండూరు మండలంలోని బొంకూరులో రూ. 97.58 లక్షలను వెచ్చించి 16 ఎకరాల 33 గుంటలను కొనుగోలు చేశారు. అదేవిధంగా బషీరాబాద్ మండలంలోని రెడ్డిఘనాపూర్‌లో రూ.59.46 లక్షలతో 9 ఎకరాల 24 గుంటలు, జీవంగిలో రూ.2.76 కోట్లతో 50 ఎకరాల 18 గుంటల భూమిని కొనుగోలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువులోగా లక్ష్యాన్ని పూర్తి చేసేందుకుగాను సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...