అనంతపద్మనాభ ఆలయంలో ఘనంగా వ్రతాలు


Sun,September 23, 2018 11:18 PM

వికారాబాద్ టౌన్: అనంత చతుర్ధశిని పురస్కరించుకొని ఆదివారం అనంతపద్మనాభస్వామి దేవాలయంలో అనంత వ్రతాలను నిర్వహించారు. ఈ అనంత వ్రతాల్లో 350 జంటలకు పైగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంత చతుర్ధశి సందర్భంగా ఉదయాన్నే చాలా మంది భక్తులు అనంతగిరికి చేరుకున్నారు. అనంతగిరి ఆలయ ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ అనంత వ్రతాలకు జంట నగరాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, గుల్బర్గా, మెదక్, మహబూబ్‌నగర్, నెల్లూరు, కరీంనగర్, నల్గొండ తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. వ్రతాల అనంతరం భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలు మొక్కలు తీర్చుకునేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన కొవ్వుత్తులు అందరినీ ఆకట్టుకున్నాయి. స్వామివారిని దర్శించుకుని ఆలయ ఆవరణలో సేద తీరారు. ఈ వ్రతాలు చాలా పవిత్రమైనవిగా మహిళా భక్తులు పేర్కొన్నారు. ఈ పవిత్ర వ్రతాలను ఒక్కసారి మొదలు పెట్టాక 14 సంవత్సరాల వరకు నిర్వహిస్తారు.

భక్తులకు సౌకర్యాల కల్పన
దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల కోసం అనంతపద్మనాభస్వామి దేవస్థానం దేవదాయ శాఖ నిర్వాహకులు ముందస్తుగా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూశారు. వర్షాకాలం కావడంతో అనంతగిరి కొండలు పచ్చదనంతో కళకళలాడాయి. ఈ వాతావరణాన్ని చూసిన వివిధ ప్రాంతాల భక్తులు పరవశించారు.
అనంతపద్మనాభస్వామిని దర్శించుకున్న
నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే
అనంతగిరిలోని అనంతపద్మనాభస్వామిని ఆదివారం నర్సాపూర్ తాజా మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు శేషగిరిపంతులు అర్చక, అభిషేకాలతో పాటు ఆశీర్వాదాన్ని అందజేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఆలయ చరిత్రను తెలుసుకున్నారు. ఆలయ ఆవరణలో సేద తీరారు. ఆయన వెంట జడ్పీటీసీ ముత్తహర్‌షరీఫ్, టీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా అదనపు ఎస్పీ పరిమాల నర్సింహులు అనంతపద్మనాభ స్వామిని ఆదివారం కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ఆశీర్వాదాలు అందజేశారు. ఆలయ పురవీధుల్లో తిరిగి ఆనందంగా గడిపారు.

120
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...